Gujarat: గుజరాత్‌ తీరంలో ఇరాన్‌ పడవ కలకలం.. రూ.425కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం..

గుజరాత్ తీరంలో ఇరాన్ పడవ కలకలం సృష్టించింది. భారత్‌ తీరంలో ఇరానీ బోటు కనిపించడం చర్చనీయాంశం అయింది. ఈ బోట్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది.

Gujarat: గుజరాత్‌ తీరంలో ఇరాన్‌ పడవ కలకలం.. రూ.425కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం..
Iran Boat

Updated on: Mar 07, 2023 | 12:15 PM

గుజరాత్ తీరంలో ఇరాన్ పడవ కలకలం సృష్టించింది. భారత్‌ తీరంలో ఇరానీ బోటు కనిపించడం చర్చనీయాంశం అయింది. ఈ బోట్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. సోదాలు చేయగా రూ.425 కోట్ల విలువైన 61 కిలోల మాదకద్రవ్యాలతో పాటు ఐదుగురు సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది.

ATS గుజరాత్, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ సహకారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌ను తీసుకెళ్తున్న ఇరాన్‌ బోటును పట్టుకున్నారు. ఈ బోటులో ఐదుగురు వ్యక్తులు ఉండగా.. భారత జలాల్లో అక్రమంగా ప్రవేశించినందుకు వారిని పట్టుకున్నారు. పడవలోని సిబ్బందితో పాటు, పడవను కూడా అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. డిఫెన్స్ వింగ్ స్టేట్‌మెంట్ ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్ సోమవారం తన రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్‌లైన ICGS మీరా బెన్, ICGS అభీక్‌లను అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ కోసం మోహరించింది. ఈ క్రమంలో ఇరాన్ బోటు భారత జలాల్లోకి ప్రవేశించడాన్ని గుర్తించిన కొస్ట్ గార్డ్ దళాలు ఆ పడవను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..