Cardiac Arrest: సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుమార్తె గుండెపోటుతో మృతి.. 19 యేళ్లకే ముంచుకొచ్చిన మృత్యువు

|

Sep 02, 2024 | 4:16 PM

అనికా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ రస్తోగి కుమార్తె. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) లో ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన 1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. అనికా.. యూపీలోని రామ్‌ మనోహర్‌ లోహియా లా కాలేజీలో బీఏ ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో..

Cardiac Arrest: సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుమార్తె గుండెపోటుతో మృతి.. 19 యేళ్లకే ముంచుకొచ్చిన మృత్యువు
Cardiac Arrest
Follow us on

లక్నో, సెప్టెంబర్‌ 2: ఉత్తర్‌ప్రదేశ్‌లో శనివారం రాత్రి (ఆగస్టు 31) విషాద ఘటన చోటుచేసుకుంది. లోహియా నేషనల్ లా యూనివర్శిటీలోని న్యాయశాస్త్ర విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. తన హాస్టల్‌ గదిలో కింద పడిపోయి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలిని అనికా రస్తోగి (19)గా గుర్తించారు.

అనికా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ రస్తోగి కుమార్తె. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) లో ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన 1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. అనికా.. యూపీలోని రామ్‌ మనోహర్‌ లోహియా లా కాలేజీలో బీఏ ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన హాస్టల్‌ గదిలో నేలపై పడి అపస్మారక స్థితిలో ఉండటాన్ని తొటి విద్యార్ధులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అనికా శనివారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుతో మరణించినట్లు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ప్రాథమికంగా నిర్ధరించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనికా శరీరంపై బట్టలు చెక్కుచెదరలేదు. ఆమె శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. హాస్టల్‌ రూమ్‌లో ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదన్నారు. బాధిత కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. శనివారం రాత్రి అనిక తన హాస్టల్ గదికి వెళ్లింది. ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె స్నేహితులు హాస్టల్‌ గది తలుపులు పగలగొట్టి చూడగా.. నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. గది లోపలి నుంచి గొల్లెం వేసి ఉండడంతో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అనికా మృతిపట్ల లోహియా నేషనల్ లా యూనివర్శిటీ సంతాపం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.