AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్ సింగం కాదు.. రియల్ సింగం… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోలీస్ వీడియో…

పోలీస్ అంటే ధైర్యం.. పోలీస్ అంటే ధీమా.. పోలీస్ అంటే రక్ష.. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా..

రీల్ సింగం కాదు.. రియల్ సింగం... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోలీస్ వీడియో...
Shiva Prajapati
|

Updated on: Nov 29, 2020 | 9:39 PM

Share

పోలీస్ అంటే ధైర్యం.. పోలీస్ అంటే ధీమా.. పోలీస్ అంటే రక్ష.. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుంటారు. అరాచక శక్తుల నుండి సామాన్యులను రక్షిస్తుంటారు. అదే సమయంలో తేడా గాళ్ల తాట తీస్తారు. ఇలాంటి కోవకే చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారికి ఆయన రీల్ సింగం కాదు.. రియల్ సింగం అనిపించక మానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్‌ను, బైక్‌ను దొంగిలించి ఆ దొంగిలించిన బైక్‌పైనే పారిపోతున్నారు. ఇది గమనించిన ఎస్ఐ అంట్లిన్ రమేష్ ఒక్కడే మరో బైక్‌పై వారిని వెంటాడి వేటాడి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. వారితో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వారి నుండి 11 దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎస్ఐ అంట్లిన్ రమేష్ ఆ దుండగులను పట్టుకున్న తాలూకు సిసి కెమెరా ఫుటేజీని ఎస్పీ మహేష్ అగర్వాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఇది ఏ సినిమాలోని సీన్ కాదు. రియల్ లైఫ్ హీరో అంట్లిన్ రమేష్ ఒంటి చేత్తో దోపిడీ దొంగలను వెంటాడి పట్టుకున్న ఘటనకు సంబంధించినది’ అని ఎస్పీ మహేష్ అగర్వాల్ పేర్కొన్నారు. స్నాచర్లను ధైర్యంగా పట్టుకున్న ఎస్ఐ అంట్లిన్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని ఎస్పీ మహేష్ అగర్వాల్ అభినందించారు.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..