AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత రూపాయి నోటుకు రూ.45లక్షలు ఇస్తామంటూ ఆఫర్.. కట్‌చేస్తే దర్యాప్తులో వెలుగులోకి 70 కోట్ల స్కామ్

అమాయక ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అమాయకుల నుంచి బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డుల వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు తేలింది. పాత ఒక్క రూపాయి నోటుకు ఏకంగా రూ.45 లక్షలు ఇస్తామని ఆశచూపి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.7 లక్షలకు పైగా కాజేసిన వ్యవహారంలో వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పాత రూపాయి నోటుకు రూ.45లక్షలు ఇస్తామంటూ ఆఫర్.. కట్‌చేస్తే దర్యాప్తులో వెలుగులోకి 70 కోట్ల స్కామ్
Old Re 1 Note Scam In Hyderabad
Anand T
|

Updated on: Oct 12, 2026 | 1:51 PM

Share

హైదరాబాద్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘరానా మోసం వెలుగు చూసింది.  పాత ఒక రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి రామాంతపూర్‌కు చెందిన గుమ్మ రమేష్ (39), ముదలే అనిల్ (19) అనే ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా రూ.7,93,351 కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ర్యాపిడో, ఉబర్‌లలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన రమేష్, రామాంతపూర్‌లోని విద్యార్థులు, డెలివరీ బాయ్స్, ఇతర అమాయకులను సంప్రదించేవాడు. కమీషన్ల ఆశచూపి వారి బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు తీసుకునేవాడు. అలా సుమారు 60 నుంచి 70 మందికి చెందిన బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, సిమ్ కార్డులను సేకరించి, వాటిని కొరియర్ ద్వారా హర్యానాలోని సైబర్ నేరగాళ్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది.

పాత రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇస్తామని ఫేస్‌బుక్ ద్వారా తనను సంప్రదించి, విడతలవారీగా రూ.7 లక్షలకు పైగా కాజేశారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితులు ‘మ్యూల్ అకౌంట్స్’ (Mule Accounts) ద్వారా నిధులు బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన 450 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us