Woman Safety: మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు తయారుచేసిన ఇంటర్ విద్యార్థి.. ఇక ఇవి వేసుకుంటే ఆకతాయిలు పారిపోవాల్సిందే

ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ కూడా ఎక్కడో ఒక చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే వాళ్లపై దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే.

Woman Safety: మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు తయారుచేసిన ఇంటర్ విద్యార్థి.. ఇక ఇవి వేసుకుంటే ఆకతాయిలు పారిపోవాల్సిందే
Electric Slippers

Updated on: May 30, 2023 | 5:17 PM

ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ కూడా ఎక్కడో ఒక చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే వాళ్లపై దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకే ఓ యువకుడు అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. ఇకనుంచి మహిళలు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఓ డివైజ్‌ను కనుగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే ఝార్ఖండ్ లోని ఛత్రాకు చెందిన ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ చదివే మంజీత్ అనే విద్యార్థి విమెన్‌ సేఫ్టీ డివైజ్‌ పేరుతో ఎలక్ట్రిక్ చెప్పులను తయారుచేశాడు.

మహిళలు, బాలికలు తమపై ఎవరైనా దాడులకు పాల్పడటం, వేధింపులకు గురిచేస్తే.. తాము వేసుకున్న ఎలక్ట్రిక్ చెప్పులతో ఆ ఆకతాయిలను తంతే వారికి కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే కింద పడిపోతారు. దీనివల్ల ఇతరుల సాయం లేకుండానే మహిళలు తమకు తాము కాపాడుకోవచ్చని మంజీత్‌ తెలిపారు. ఎలక్ర్టిక్‌ చెప్పులు అంటే వాటి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ కేవలం రూ. 500కే ఈ చెప్పులను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నాడు. సాధారణంగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా తీసుకుని వాటి కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్‌ సహా కొన్ని చిన్న పరికరాలను అమర్చి ఈ ఎలక్ర్టిక్‌ చెప్పులను తయారు చేశాడు. అలాగే ఈ డివైజ్‌కు అరగంట ఛార్జింగ్‌ పెడితే రెండు రోజుల వరకు తిరగొచ్చని మంజీత్‌ చెప్పాడు. ఈ చెప్పులు తయారు చేసేందుకు వారం రోజుల సమయం పట్టిందని.. నిర్భయ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈ ఎలక్ట్రిక్ చెప్పులు తయారుచేసినట్లు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.