Video: పార్క్‌లో అమ్మాయితో అబ్బాయి..! ఊహించని పని చేస్తుండగా.. అక్కడున్న వారు చూసి
కాన్పూర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జంట మధ్య ప్రేమ వ్యవహారం భయంకర ఘటనగా మారింది. తిరస్కరించిన తర్వాత, ప్రేమికుడు తన ప్రియురాలి గొంతుకు చున్నీతో బిగించి హత్యాయత్నం చేశాడు. సాక్షులు జోక్యం చేసుకోవడంతో అతడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది.. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒక రోజు మాట్లాడుకుందాం రమ్మంటూ.. ఆ అమ్మాయిని పార్క్‌కు పిలిపించాడు అబ్బాయి. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఊహించని పని చేశాడు. ఆ అమ్మాయి చున్నీతోనే ఆమె గొంతుకు బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటనను అక్కడున్న వారి చూసి గద్దించారు. దీంతో ఆ కుర్రాడు అక్కడి నుంచి పారిపోయాడు. అసలు అతను అలా ఎందుకు చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయికి అమన్ సోంకర్ అనే కుర్రాడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు.
ఇలా వీరి ప్రేమ వ్యవహారం సాగుతున్న క్రమంలో అమన్ సోంకర్‌పై గతంలో పోలీస్ కేసులు ఉన్నాయని, అతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని ఆ అమ్మాయికి తెలిసిందే. తాను ప్రేమించింది ఓ జులాయి రౌడీని అని తెలుసుకొని.. ఆ అమ్మాయి అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయినా కానీ సోంకర్ ఆమెను వదిలిపెట్టలేదు. వివిధ నంబర్లతో ఆమె ఇంటికి ఫోన్ చేస్తూ.. తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఇదే విషయం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామని కాన్పూర్‌లోని ఓ పబ్లిక్ పార్క్‌కు రమ్మన్నాడు. అలా రాకుంటే తాము కలిసి దిగిన ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన ఆ అమ్మాయితో అతనితో మాట్లాడేందుకు పార్క్‌కు వెళ్లింది.
అలా వెళ్లిన ఆ అమ్మాయిని తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఆమె ఎంతకీ వినకపోవడంతో ” అగర్ తుమ్ మేరీ నహీ హో సక్తి, తో మై తుమ్హే కిసీ ఔర్ కి భీ నహీ హోనే దుంగా (నువ్వు నాదానివి కాకపోతే, నేను నిన్ను వేరొకరి దానిగా కానివ్వను) అంటూ ఆమెను చున్నీతో ఆమె గొంతుకు బిగించి చంపే ప్రయత్నం చేశాడు. ఈ భయానక దృశ్యాలను చూసిన వారు జోక్యం చేసుకోవడంతో అతను అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఆ అమ్మాయి, ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సోంకర్ పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Kanpur | Instagram पर हुई लड़की की दोस्ती, लड़के ने कर दिया ये कांड! | Uttar Pradesh | Shorts . .#kanpur #KanpurNews #Crime #BreakingNews #LatestNews #UttarPradesh #jmdnewsflash | @kanpurnagarpol pic.twitter.com/6t6Pb8Iasn
— JMD NEWS (@jmdnewsflash) May 17, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
