Kargil Martyr Son: తాను పుట్టడానికి 45 రోజుల ముందు కార్గిల్ వార్‌లో తండ్రిని కోల్పోయిన తనయుడు.. ఐఐఎం సీటు వద్దని ఆర్మీలో చేరిక

|

May 23, 2023 | 11:05 AM

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రెండు ఐఐఎంలలో వచ్చిన ఎంబీఏ సీట్లను కాదని దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్న మహారాష్ట్రకు చెందిన కార్గిల్ అమరవీరుడి కుమారుడు ప్రజ్వల్‌ సమ్రిత్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Kargil Martyr Son: తాను పుట్టడానికి 45 రోజుల ముందు కార్గిల్ వార్‌లో తండ్రిని కోల్పోయిన తనయుడు.. ఐఐఎం సీటు వద్దని ఆర్మీలో చేరిక
Prajwal Samrit
Follow us on

సినీ యాక్టర్ తనయుడు సినీ యాక్టర్, రాజకీయ నేత కొడుకు రాజకీయ నేతగా వారసత్వాన్ని అందుకోవడం చూస్తూనే ఉన్నాం.. అయితే తమ ఇంటి కుటుంబ సభ్యులు ఆర్మీలో చేరి.. ప్రాణాలు పోగొట్టుకున్నా.. వారి బాటలో నడుస్తూ.. తాము కూడా దేశానికి సేవ చేస్తాం అంటూ మిలటరీలో చేరడం నిజంగా హర్షణీయం అనిపిస్తుంది. కార్గిల్ వార్ లో తండ్రి వీరమరణం పొందితే.. కొడుకు మంచి చదువులు చదివి కూడా ఆర్మీలో చేరాడు. అవును దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రెండు ఐఐఎంలలో వచ్చిన ఎంబీఏ సీట్లను కాదని దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్న మహారాష్ట్రకు చెందిన కార్గిల్ అమరవీరుడి కుమారుడు ప్రజ్వల్‌ సమ్రిత్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మహారాష్ట్రకు చెందిన ప్రజ్వల్ తండ్రి లాన్స్ నాయక్ కృష్ణజీ సమ్రిత్ 1999లో కార్గిల్ పుల్గావ్‌లో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించిన 45 రోజుల తర్వాత ప్రజ్వల్ జన్మించాడు. అప్పటికే కృష్ణాజీ కి 2.5 సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. తల్లి సవిత, అన్నయ్య కునాల్ తో కలిసి ప్రజ్వల్ నివసిస్తున్నాడు. కునాల్ ఎంటెక్‌ పూర్తి చేసి పుణేలో ఉద్యోగం చేస్తున్నాడు.

ప్రజ్వల్‌ బీఎస్సీ చదివాడు. అయితే ప్రజ్వల్ తండ్రిబాటలోనే తాను పయనించాలనుకున్నాడు. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నాడు. దీంతో ఆర్మీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. ఎస్‌ఎస్‌బీ పరీక్షలో పాస్ అయ్యేలా కష్టపడం మొదలు పెట్టాడు. మెడికల్‌ పరీక్షల్లో కూడా ఉతీర్ణత సాధించాడు. ఇప్పుడు ఆర్మీకి ఎంపికయ్యాడు. జూలైలో డెహ్రాడూన్‌లోని మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకోనున్నాడు ప్రజ్వల్. శిక్షణ పూర్తి అయ్యాక లెఫ్ట్‌నెంట్‌ హోదాలో ఆర్మీలో బాధ్యతలను తీసుకోనున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే ప్రజ్వల్ దేశంలోని ఐఐఎంలో ఎంట్రీ కోసం నిర్వహించే ‘క్యాట్‌’ పరీక్షను రాశాడు. ఇందులో 97.51 పర్సంటేజ్ తో మంచి ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇండోర్‌, కోజికోడ్‌లోని జాయిన్ అయ్యే అవకాశం  వచ్చింది. దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఉద్యోగం లభించినా ప్రజ్వల్ మాత్రం ఆర్మీనే ఎంపిక చేసుకున్నాడు.

తన కుమారుడు ఆర్మీలో చేరడంపై ప్రజ్వల్ తల్లి సవిత (52) సంతోషాన్ని వ్యక్తం చేసింది. కార్గిల్ యుద్ధంలో తన జీవిత భాగస్వామిని కోల్పోయినప్పటికీ, తన కుమారుల్లో ఒకరు ఆర్మీలో చేరాలనుకోవడం పై స్పందిస్తూ..  నా భర్త తన పెద్ద కొడుకు ఆర్మీలో ఆఫీసర్‌గా చేరాలని కోరుకున్నాడు. కునాల్‌ చేరకపోయినా ప్రజ్వల్‌ మిలటరీలో చేరడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పింది.

సవిత పుల్గావ్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది. 1991లో కృష్ణజీని వివాహం చేసుకుంది. కృష్ణజీ కార్గిల్‌లో విధులు చేరే ముందు.. తన భార్య సవితతో కలిసి త్రివేండ్రం, బెల్గాం, కోల్‌కతాలో నివసించారు. కృష్ణజీ తల్లిదండ్రులు మరణించినందున సవిత తన తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోని పుల్గావ్‌లో నివసిస్తోంది.

ప్రజ్వల్ ఐఐఎంలో ఎంబీఏ చదివి ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ ఆర్మీలోనే చేరి తన తండ్రిలా దేశానికి సేవచేస్తానని చెప్పడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..