Lok Sabha Elections 2024: ఎన్నికల ఖర్చుకోసం స్విస్ ఖాతాల నుంచి రూ.60 కోట్లు విత్‌డ్రా.. మాజీ పీఎం ఇందిరా గాంధీపై ఆరోపణలు
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల ఖర్చుల కోసం స్విస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.60 కోట్లు విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది ఇంధిరా ప్రధానిగా ఉన్నప్పటి నాటి వివాదం. ఈ విషయం అప్పట్లో దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ వివాదంగా..
చండీగఢ్, ఏప్రిల్ 11: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల ఖర్చుల కోసం స్విస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.60 కోట్లు విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది ఇంధిరా ప్రధానిగా ఉన్నప్పటి నాటి వివాదం. ఈ విషయం అప్పట్లో దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ వివాదంగా మారింది. దీనిపై భారత రాజకీయ వర్గాల్లోనే కాకుండా స్విట్జర్లాండ్ పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేగింది. 1979 డిసెంబరు 31న అమర్ ఉజాలాలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం..
అప్పటి ప్రధాని చౌదరి చరణ్ సింగ్ భువనేశ్వర్‌లో ప్రసంగిస్తూ ఇందిరా గాంధీ స్విస్ ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేసిన అంశాన్ని లేవనెత్తారు. దీని తర్వాత భారత ప్రభుత్వం స్విస్ అధికారులను విచారణ కోరింది. అయితే కేసు చుట్టూ ఉన్న న్యాయపరిధి సంక్లిష్టతల కారణంగా నిధులను ట్రాక్ చేయడం చాలా సవాలుగా మారింది. ముందుగా రూ.40 కోట్లు విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు రాగా.. ఆ తర్వాత అసలు మొత్తం రూ.60 కోట్లుగా లెక్క తేలింది. ఈ కోణంలో విచారణ వేగవంతం చేశారు.
లక్నోలోని హజ్రత్ మహల్ పార్క్ వద్ద ఎన్నికల ర్యాలీలో చరణ్ సింగ్ ప్రసంగిస్తూ, నాటి ఎన్నికల సమయంలో ఇందిర గాంధీ 10 వేల జీపులను కొనుగోలు చేశారని ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఒక్కో కాంగ్రెస్ అభ్యర్థికి రూ.5 లక్షల చొప్పున అందజేసినట్లు ఆయన అప్పట్లో ఆరోపణలు చేశారు. విదేశాల నుంచి ముంబైకి పెద్ద ఎత్తున డబ్బులు రావడంపై ఆయన ఈ విషయాన్ని హైలైట్ చేశాడు. నాటి ఎన్నికల వివాదాలు, వాటి మూలాలు ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న ఎన్నికల నేపథ్యంలో మరోమారు తెరపైకి వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.