ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం అస్సాంలోని గౌహతి నుండి దిబ్రూగఢ్‌కు జూన్ 4న ఉదయం బయలుదేరింది. కానీ 20 నిమిషాల తర్వాత కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని మళ్లీ గౌహతికి తీసుకెళ్లారు. ప్రముఖ గోపీనాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం ఉదయం 8.40 గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత వెంటనే 20 నిమిషాల తర్వాత విమానాన్ని మళ్లీ గౌహతి వైపు మళ్లించారు. అయితే, విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య రావడంతో కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి విమానాన్ని అస్సాంలోని గువాహటి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కాగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..తాను.. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్, తెరస్ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరామని. దులియాజన్, టింగ్‌ఖాంగ్, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లోనే గువహాటి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేం సురక్షితంగా ఉన్నాం అని తెలిపారు. తాను ఇంకా విమానాశ్రయం లోనే ఉన్నానని, ఆ విమానం నడవదని అధికారులు చెప్పారని రామేశ్వర్ తెలి చెప్పారు.
మరోవైపు దిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా దిగిందని గువాహాటి ఎయిర్‌పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 150 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. తనిఖీల కోసం విమానాన్ని పంపినట్లు చెప్పాయి.
A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V
— ANI (@ANI) June 4, 2023
ఈ విమానంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీతో పాటు దిబ్రూగఢ్ ఎమ్మెల్యే ప్రశాంత్ ఫుకాన్, దునియాజన్ ఎమ్మెల్యే తెరేష్ గ్వాలా కూడా ఉన్నారు. వారితో పాటు పలువురు ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇండిగో ఫ్లైట్ 6E2652 కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 20 నిమిషాల్లో గౌహతిలోని ప్రముఖ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించబడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..