AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s 1st AC Govt school: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడి.. దేశంలోనే తొలి ఏసీ పాఠశాల ఎక్కడుందో తెలుసా..

దేశంలోనే మొట్టమొదటి సారిగా పూర్తిగా ఏసీ గదులతో కూడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కేరళ ప్రభుత్వం నిర్మించింది. మల్లప్పురంలోని మేల్మురి ముట్టిపాడులో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ పాఠశాలను అక్టోబర్ 19న ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. 19న సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎంపీ ఈటీ ముహమ్మద్ బషీర్ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు.

India’s 1st  AC Govt school: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడి.. దేశంలోనే తొలి ఏసీ పాఠశాల ఎక్కడుందో తెలుసా..
Indias 1st Ac Govt School
Anand T
|

Updated on: Oct 13, 2025 | 1:01 PM

Share

కేరళ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పూర్తి ఏసీ గదులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను అందుబాటులోకి తీసుకురానుంది. మల్లప్పురంలోని మేల్మురి ముట్టిపాడులో అత్యాధునిక సౌకర్యాలతో ఈ పాఠశాలను ప్రభుత్వ నిర్మించింది. ఈ పాఠశాలలో ఎనిమిది తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, స్టాఫ్ రూమ్, HM గదితో సహా  పాఠశాలలోని మొత్తం గదులకు ఏసీలను అమర్చారు. సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు అంతస్తుల భవనంలో పూర్తి అదునాతన ఫర్నిచరైన FRP బెంచీలు, డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

ప్రతి అంతస్తులో తాగ్రునీరు, ప్రతి తరగతి గదిలో డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్‌లు, క్యాంపస్ అంతటా ఇంటిగ్రేటెడ్ సౌండ్ సిస్టమ్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.అంతేకాదు ప్రతి తరగతి గదిలో ఒక చిన్న లైబ్రరీ, స్టూడెంట్స్ తమ షూ లేదా చెప్పులు పెట్టుకోవడానికి షూ ర్యాక్స్‌ను కూడ ఏర్పాటు చేశారు.ఈ స్కూల్‌లో అధునాతన ఫర్నిచర్‌, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.5కోట్ల మేర ఖర్చు పెట్టింది.స్థానిక ఎమ్మెల్యే పి.ఉబైదుల్ కూడా తన వంతుగా పాఠశాల అభివృద్ధి కోసం రూ. 50లక్షల అందించారు.

కేరళ ప్రభుత్వం నిర్మించిన ఈ పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలకు ఒక మైలురాయిగా నిలువనుంది. ఇది విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆదర్శంగా మారనుంది.

అయితే దేశంలో ఇంతకు ముందు కూడా పంజాబ్‌ ప్రభుత్వం ఏసీ పాఠశాలను నిర్మించింది. కానీ అక్కడ ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో దాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు కేరళలో నిర్మించిన ఈ పాఠశాల పూర్తి AC గదలుతో అందుబాటులోకి రానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.