భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద కొత్త సైన్‌బోర్డ్ ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఓ గ్రామం స్వాగతం చెబుతూ.. వచ్చిన మార్పును ప్రతిబింబిస్తుంది. ఇక నుంచి ఈ గ్రామం భారత దేశంలోని మొదటి గ్రామం అని పేర్కొన్నారు. మనదేశంలోని మొదటి గ్రామం గా ఉత్తరాఖండ్ లోని మాణా గ్రామం ఏర్పాటు అయింది. ఈ మేరకు దేశ సరిహద్దు రహదారుల సంస్థ ఓ స్వాగత తోరణ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ మాణా గ్రామం భారత్ చైనా సరిహద్దు రేఖ వెంబడి.. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ సమీపంలో ఉంది.
ఇదే విషయాన్ని పేర్కొంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. ఇక నుంచి మాణా గ్రామం.. దేశ చివరి గ్రామం కాదు.. మొదటి గ్రామంగా గుర్తింపుని సొంతం చేసుకుంది అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అంతేకాదు గత ఏడాది అక్టోబరులో చమోలి గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో ఈ గ్రామం నుంచి ప్రసంగిస్తూ.. సరిహద్దు గ్రామం మాణా దేశానికి మొదటి గ్రామం అని పేర్కొన్న సంగతి గుర్తు చేశారు ధామి. ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ వెల్కమ్ బోర్డు ఏర్పాటు అయింది. చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళ్లే భక్తులు మాణా గ్రామంలో ప్రకృతి అందాలను చూస్తూ పులకిస్తూ ఉంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..