Indian Railways: ఢిల్లీ రైల్వే స్టేషన్‌ నూతన నిర్మాణ డిజైన్‌లను షేర్‌ చేసిన ఇండియన్‌ రైల్వే.. ఎయిర్‌ పోర్ట్‌లు కూడా బలాదూర్‌ అనేలా..

Indian Railways: దేశంలో ఉన్న అత్యంత పురాతన, రద్దీ రైల్వే స్టేషన్లలో దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ ఒకటి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ను త్వరలోనే ప్రపంచస్థాయి స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నారు...

Indian Railways: ఢిల్లీ రైల్వే స్టేషన్‌ నూతన నిర్మాణ డిజైన్‌లను షేర్‌ చేసిన ఇండియన్‌ రైల్వే.. ఎయిర్‌ పోర్ట్‌లు కూడా బలాదూర్‌ అనేలా..
Indian Railways

Updated on: Sep 03, 2022 | 12:05 PM

Indian Railways: దేశంలో ఉన్న అత్యంత పురాతన, రద్దీ రైల్వే స్టేషన్లలో దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ ఒకటి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ను త్వరలోనే ప్రపంచస్థాయి స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నారు. ఇండియన్‌ రైల్వే ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణ మోడల్స్‌కి సంబంధించిన ఫొటోలను రైల్వే మినిస్టరీ ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అత్యాధునిక నిర్మాణ శైలిలో ఉన్న ఈ డిజైన్స్‌ విమానాశ్రయాలను సైతం తలదన్నేలా ఉండడం విశేషం. ఈ కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత ఆధునిక స్టేషన్‌గా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే దేశంలో ఉన్న పలు రైల్వే స్టేషన్‌లకు మహర్దశ తీసుకొచ్చే లక్ష్యంగా ఇండియన్‌ రైల్వేస్‌ 1215 రైల్వేస్టేషన్‌లను ఆదర్శ్‌ స్టేషన్‌లుగా మార్చనుంది. ఇండియన్‌ రైల్వేస్టేషన్స్‌ను మోడల్‌, మోడరన్‌, ఆదర్శ్‌ విభాగాల్లో అభివృద్ధి చేయనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదర్శ్‌ పథకంలో భాగంగా 1253 రైల్వేస్టేషన్‌లను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 1215 రైల్వేస్టేషన్‌లలో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే 52 రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలని ఇండియన్‌ రైల్వేస్‌ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..