AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దేశంలో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయా..? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ..

PPP విధానంలో ప్యాసింజర్ రైళ్లను నడిపటం ద్వారా రైల్వేకు ప్రైవేట్ రంగం నుంచి దాదాపు రూ. 30,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు వార్తా నివేదిక పేర్కొంది.

Indian Railways: దేశంలో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయా..? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ..
Trains
Shaik Madar Saheb
|

Updated on: Sep 07, 2022 | 12:46 PM

Share

Private passenger trains: భారతీయ రైల్వే ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా 150 జతల ప్యాసింజర్ రైళ్లను నడపడానికి బిడ్‌లను స్వాగతించినట్లు ఓ మీడియా సంస్థ వార్తలను ప్రచురించింది. రైల్వేలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) సేవల కోసం ప్రైవేటు సంస్థల నుంచి భారతీయ రైల్వే మొదటిసారిగా బిడ్‌లను ఆహ్వానించినట్లు పేర్కొంది. ఈ రైళ్లలో ప్రయాణీకుల ఛార్జీలను నిర్ణయించే స్వేచ్ఛ ప్రైవేట్ సంస్థలకు ఉంటుందని వార్తా కథనంలో వివరించింది. PPP విధానంలో ప్యాసింజర్ రైళ్లను నడిపటం ద్వారా రైల్వేకు ప్రైవేట్ రంగం నుంచి దాదాపు రూ. 30,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు వార్తా నివేదిక పేర్కొంది. ఈ రైళ్లు రైల్వే నెట్‌వర్క్‌లోని 12 క్లస్టర్లలో భాగంగా ఉంటాయని పేర్కొంది. ఈ రైళ్లలో ప్రతి ఒక్కటి కనీసం 384 మీటర్ల పొడవుతోపాటు 16 కోచ్‌లతో సమానంగా ఉంటాయని తెలిపింది.

అయితే, ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇవన్నీ తప్పుదోవ పట్టించే మీడియా కథనాలంటూ వెల్లడించింది. రైల్వేలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) విధానంలో ప్యాసింజర్ రైళ్లను నడపడానికి ఎలాంటి బిడ్‌లను ఆహ్వానించే ఆలోచన లేదని రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని.. ఇవన్నీ అబద్దాలేనంటూ కొట్టిపారేసింది.

పిల్లలకూ రైలు టికెట్ ..

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. రైల్వే మంత్రిత్వ శాఖ గత నెలలో పిల్లల కోసం రైలు టిక్కెట్ల బుకింగ్ నిబంధనలలో మార్పులు చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. రైలులో ప్రయాణించే పిల్లలకు టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి రైల్వే నిబంధనను మార్చినట్లు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ నివేదికల ప్రకారం ఇప్పుడు రైలులో ప్రయాణించడానికి ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు టికెట్ పొందవలసి ఉంటుంది. దీనిపై కూడా భారతీయ రైల్వే స్పందించింది. రైలులో ప్రయాణించే పిల్లలకు టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి భారతీయ రైల్వే ఎటువంటి మార్పులను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా.. టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి బదులు.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బెర్త్‌ను బుక్ చేసుకోవడానికి వారికి ఒక ఎంపిక ఇచ్చినట్లు స్పష్టంచేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం