Free WiFi – Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకుచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని ఆరు వేల రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఝార్ఖండ్‌లోని హజారిబాగ్ టౌన్‌లో ఆదివారం ఫ్రీ వైఫై సేవలను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య ఆరు వేలకు చేరినట్లు తెలిపింది. తూర్పు సెంట్రల్ రైల్వే పరిధిలోని ధన్‌బాద్ డివిజన్‌లోని హజారిబాగ్ టౌన్‌లో వై-ఫై సేవలు ప్రారంభించడంతో.. భారత రైల్వే ఫ్రీ వైఫై అందిస్తున్న స్టేషన్ల సంఖ్య 6,000 చేరుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత రైల్వే 2016లో ముంబై రైల్వే స్టేషన్‌లో మొదటి వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ వద్ద 5000వ స్టేషన్‌కు ఈ సౌకర్యాన్ని విస్తరించింది. వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో స్టేషన్‌లో ఉన్నవారెవరైనా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకునేందుకు రైల్వే అవకాశం కల్పించింది. రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా వైఫై సేవలను అందిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. దీనిలో భాగంగా మరిన్ని స్టేషన్లల్లో ఉచిత వైఫై సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: