Indian Railways: ప్రయాణీకులకు రైల్వే శాఖ షాక్.. ప్లాట్‌ఫార్మ్ టికెట్లు భారీగా పెంపు..

|

Mar 05, 2021 | 12:29 PM

Platform Ticket Hiked: రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫార్మ్ టికెట్ల రేట్లను..

Indian Railways: ప్రయాణీకులకు రైల్వే శాఖ షాక్.. ప్లాట్‌ఫార్మ్ టికెట్లు భారీగా పెంపు..
Follow us on

Platform Ticket Hiked: రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫార్మ్ టికెట్ల రేట్లను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ప్లాట్‌ఫార్మ్ టికెట్ ధర రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 30కి పెంచింది. అలాగే లోకల్ ట్రైన్స్‌లో కూడా కనీస ఛార్జీని రూ. 30గా నిర్ణయించింది. కరోనా మహమ్మారి సమయంలో అనవసరమైన ప్రయాణాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్లాట్‌ఫార్మ్‌పై ఎక్కువ మంది జనం గుమిగూడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్లాట్‌ఫార్మ్ టికెట్ల రేట్లను పెంచినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

కాగా, ఛార్జీలు పెంచిన విషయంపై రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. “ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్టేషన్లలో రద్దీని నివారించడానికి రైల్వే శాఖ తీసుకున్న తాత్కాలిక చర్య” అని ప్రకటనలో తెలిపింది. అటు ప్లాట్‌ఫాం టికెట్ ఛార్జీలు మార్చే విషయంలో స్టేషన్ DRMలకు కేంద్ర రైల్వే శాఖ పూర్తి బాధ్యతను అప్పగించింది. ఈ చర్య కొత్తేమి కాదని.. రైల్వే స్టేషన్లలో క్రౌడ్‌ను కంట్రోల్ చేసేందుకు అప్పుడప్పుడూ అమలు చేస్తుంటామని చెప్పుకొచ్చింది.

Also Read:

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!

Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!