Corona Cases Update: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 16,838 పాజిటివ్ కేసులు, 113 మరణాలు..
Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 మందికి కరోనా పాజిటివ్‌గా..
Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది. నిన్న కొత్తగా 13,819 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,08,39,894 కోలుకున్నారు.
కాగా, గురువారం ఒక్కరోజే 113 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,57,548కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,76,319 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!
Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!