AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇక రైలు ప్రయాణం బోర్‌ కొట్టదు.. ఎంజాయ్‌ చేస్తూ జర్నీ చేయొచ్చు.. అందుబాటులోకి కొత్త సేవ..

Content On Demand Indian Railways: ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్‌ రైల్వే త్వరలోనే కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇకపై రైలు జర్నీ అంటే బోర్‌ అనే ఆలోచన రాకుండా ఉండేందుకు..

Indian Railways: ఇక రైలు ప్రయాణం బోర్‌ కొట్టదు.. ఎంజాయ్‌ చేస్తూ జర్నీ చేయొచ్చు.. అందుబాటులోకి కొత్త సేవ..
Narender Vaitla
|

Updated on: Mar 05, 2021 | 11:38 AM

Share

Content On Demand Indian Railways: ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్‌ రైల్వే త్వరలోనే కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇకపై రైలు జర్నీ అంటే బోర్‌ అనే ఆలోచన రాకుండా ఉండేందుకు ప్రయాణికులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు తమకు నచ్చిన సినిమాలు, వినోద కార్యక్రమాలు చూస్తూ జాలీగా జర్నీ చేయొచ్చు. ఇందులో భాగంగానే రైల్వే శాఖ కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ (సీఓడీ) సేవలను ప్రారంభించనుంది. దీంతో ఇక నుంచి ప్రయాణికులు ప్రీలోడెడ్‌ సినిమాలు, వీడియాలతో పాటు పలు వినోద కార్యక్రమాలను చూడొచ్చు. ఇక వీడియోలు ఎలాంటి బఫరింగ్‌ లేకుండా ప్లే అయ్యేందుకు గాను బోగీల్లో సర్వర్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 8,731 రైళ్లు, వీటిలో 5,723 సబర్బన్‌ రైళ్లు.. 5,952 పైచిలుకు వైఫై కలిగిన రైల్వే స్టేషన్లలో సీఓడీ సేవలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ సేవలను పశ్చిమ రైల్వేలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌, ఏసీ సబర్బన్‌ బోగీల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ టెస్టింగ్‌ తుది దశకు చేరుకుంది. టెస్టింగ్‌ పూర్తికాగానే ఈ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి కనీసం రూ.60 కోట్ల ఆదాయం పొందాలని రైల్వే శాఖ భావిస్తోంది. రైళ్లతో పాటు రైల్వే స్టేషనల్లో అందుబాటులోకి రానున్న ఈ సేవల కోసం రైల్వే శాఖ.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుబంధ సంస్థ మార్గో నెట్‌ వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవలను రానున్న రెండేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: New Job Portal: కేంద్రం కీలక నిర్ణయం.. కార్మికుల కోసం నూతన జాబ్ పోర్టల్.. పూర్తి వివరాలు ఇవే.!

కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు.!

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు‌ అంత ప్రత్యేకత ఏమిటి..? గోల్డ్‌ సర్టిఫికేషన్‌ రావడానికి కారణం ఏమిటి.?