AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యతతో పెరుగుతున్న నేపథ్యంలో రైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఇప్పటికే కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్‌ స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు.

Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!
Vandebharath
Anand T
|

Updated on: Jul 22, 2025 | 1:58 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రారంభమైన వందేభారత్‌ రైలుకు ప్రజాధరణ పెరగడంతో ఇటీవలే ఈ ట్రైన్‌లో కోచ్‌లను పెంచుతూ రైల్వేశాఖ అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ వందేభారత్‌ ట్రైన్‌ ప్రారంభం సమయంలో 16 కోచ్ లతో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. తాజాగా పెరిగిన డిమాండ్‌తో వీటి కోచ్‌లను రైల్వేశాఖ 20కి పెంచింది. కోచ్‌లు పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉంటున్న ఈ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు కలుగుతుంది. అయితే ఈ వందేభారత్‌ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు అసక్తి చూపుతుండడంతో వారికి మరింత సౌకర్యాన్ని అందించేందుకు.. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచేందుకు సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీలను యాడ్‌ చేస్తూ ఇటీవలే సదుపాయాన్ని కల్పించిన రైల్వే శాఖ తాజా వీటిపై మరో నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు వందేభారత్ అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఏలూరు వద్ద కల్పించిన అదనపు స్టాపేజీ సదుపాయం గడువు వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడగిస్తున్నట్టు పేర్కొంది. దీనితో పాటు 20833/20834 నెంబర్‌ గల వందేభారత్‌ ఎక్ స్‌ప్రెస్‏ రైళ్లకు సామర్లకోట వద్ద కల్పించిన అదనపు స్టాపేజీల సదుపాయాన్ని కూడా ఆరునెలల పాటు పెంచుతున్నట్టు తెలిపింది.

ఇదిలా ఉండగా వందేభారత్‌లో స్లీపర్‌ సర్వీసులకు కూడా ప్రారంభించేందుకు ఇండియన్‌ రైల్వేస్‌ కసరత్తు చేస్తోంది. వీటి తయారీ పూర్తయితే తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు మూడు-నాలుగు మార్గాల్లో వందేభారత్ స్లీపర్ కేటాయించాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..