Indian Railways: మూడు గంటల్లో హైదరాబాద్‌ టూ బెంగళూరు ప్రయాణం.. రూ.30 వేల కోట్లతో సరికొత్త రైల్వే ట్రాక్‌..

|

Aug 13, 2022 | 4:18 PM

Indian Railways: ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం గతి శక్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రోడ్లు, రైల్వే, విమానయానం, నౌకాశ్రయాల అభివృద్ధికి..

Indian Railways: మూడు గంటల్లో హైదరాబాద్‌ టూ బెంగళూరు ప్రయాణం.. రూ.30 వేల కోట్లతో సరికొత్త రైల్వే ట్రాక్‌..
Representative Image
Follow us on

Indian Railways: ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం గతి శక్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రోడ్లు, రైల్వే, విమానయానం, నౌకాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వ పెద్ద పీట వేసింది. అధునాతన రవాణా సదుపాయాలు అందించే క్రమంలోనే కోట్లాది రూపాయలతో ప్రాజెక్టులకు రూపలకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇండియన్‌ రైల్వే కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. సెమీ-హై స్పీడ్‌ ట్రాక్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ ట్రాక్‌పై రైలు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. సుమారు రూ. 30 వేల కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ ట్రాక్‌ నిర్మాణం సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరుకు నిర్మించనున్నారు. నిజానికి సికింద్రాబాద్, బెంగళూరుల మధ్య దూరం 622 కి.మీలు కాగా, ఈ ట్రాక్‌ పొడవు 503 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి కారణం.. ఈ ట్రాక్‌ను శంషాబాద్‌కు సమీపంలో ఉన్న ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బెంగళూరుకు సమీపంలోని యెలహంక స్టేషన్‌ వరకు నిర్మిస్తుండడమే.

ఈ సెమీ-హైస్పీడ్‌ ట్రాక్‌ కోసం ఇండియన్‌ రైల్వే కిలోమీటర్‌కు ఏకంగా రూ. 60 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ట్రాక్‌కు రెండు పక్కల 1.5 మీటర్ల పొడవుతో గోడను కూడా నిర్మించనున్నారు. ఢిల్లీ, మీరట్‌ల మధ్య, ముంబై – అహ్మదాబాద్‌ల మధ్య నిర్మించనున్న బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ నిర్మాణం కోసం కిలోమీటర్‌కు రూ. 300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం రైల్వే అధికారులు ఢిల్లీ – ముంబై, ఢిల్లీ – హౌరా మార్గాలను ఆధునీకరిస్తున్నారు. ఈ ట్రాక్‌లపై రైళ్లు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌ – బెంగళూరు మధ్య నిర్మించనున్న ట్రాక్‌ను గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా నిర్మించనున్నారు. గతిశక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు ఐటీ పట్టణాల మధ్య హైస్పీడ్‌ ట్రాక్‌ను నిర్మించే యోచనలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

రైల్వే వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో ఇండియన్‌ రైల్వేస్‌ అధునాతన వ్యవస్థను ఉపయోగించుకోనుంది. ఇందులో భాగంగానే రైళ్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఈ ట్రాక్‌ అందుబాటులోకి వస్తే ఇకపై హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు కేవలం మూడు గంటల్లోపే చేరుకోవచ్చన్నమాట. ఇదిలా ఉంటే ఇండియన్‌ రైల్వే ఇప్పటికే 106 కిలోమీటర్ల వేగంతో దూసుకెల్లే 302 వందే భారత్‌ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ మరియు మీరట్ మధ్య ఆర్‌ఆర్‌టిఎస్ కారిడార్ లేదా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం వంటి వయాడక్ట్‌లతో ఎలివేటెడ్ రూట్‌కు కిలోమీటరుకు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..