Chenab Rail Bridge: అందుబాటులోకి వచ్చిన చీనాబ్ రైల్ బ్రిడ్జి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది..

Chenab Railway Bridge: అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా చీనాబ్ నదిపై ప్రపంచంలోనే..

Chenab Rail Bridge: అందుబాటులోకి వచ్చిన చీనాబ్ రైల్ బ్రిడ్జి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది..
Chenab Railway Bridge
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 13, 2022 | 4:13 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్-ఆర్చ్ రైల్వే వంతెనపై ఓవర్‌ఆర్చ్ డెక్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ వంతన శ్రీనగర్‌లోని మిగిలిన భారతదేశానికి అనుసంధానించబడుతుంది. చీనాబ్ నది లోయ రెండు చివరల నుంచి వంపుపై మొదలు.. అది చివరికి వంపు మధ్యలో కలుపుతుంది. ప్రపంచంలోని అద్భుత‌మైన ఇంజ‌నీరింగ్ శ్రమ‌కు జమ్ము కశ్మీర్ వేదికగా మారుతోంది. ఆ రాష్ట్రంలోని రియాసి జిల్లాలో 1.3-కిమీ పొడవున్న చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించింది మోదీ సర్కార్.

ఈ వివరాలను కొంకణ్ రైల్వే చైర్మన్, ఎండీ సంజయ్ గుప్తా మీడియాతో తెలిపారు, “ఇది సుదీర్ఘ ప్రయాణం. ‘గోల్డెన్ జాయింట్’ అనే పదాన్ని సివిల్ ఇంజనీర్లు ఉపయోగించారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన.” చీనాబ్ వంతెన అనేక సవాళ్లను అధిగమించి.. క్లిష్టమైన ఇంజనీరింగ్‌ ప్రతిభతో నిర్మించారని అన్నారు. ఎన్నో అత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న కశ్మిర్‌లో ఈ వంతెన కనెక్టివిటీని పెంచుతుందని వారు నమ్ముతున్నారు. కశ్మీర్ అభివృద్ధిలో ఈ బ్రడ్జి మ‌రో మైలు రాయిగా ఆయన అభివర్ణించారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణంలో 28,660 MT స్టీల్, 10 లక్షల కమ్ ఎర్త్‌వర్క్, 66,000 కమ్ కాంక్రీటు, 26 కి.మీ మోటరబుల్ రోడ్ల నిర్మాణం చేశారు.

చీనాబ్ వంతెన వివరాలు ఇలా..

చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెన.. భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన కూడా ఇదే. ఇది జమ్ము కశ్మీర్‌‌లోని రేసి జిల్లాలో బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానం చేస్తుంది. ఈ వంతెన 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు) తో చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది. ఈ వంతెన అనేక వంతెనల, సొరంగాల భాగం దీనిని జమ్ము కశ్మీర్‌లోని USBRL ప్రాజెక్ట్ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తుంది. ఈ లింక్ లో మరో చిన్న ఆర్చి వంతెన కత్రా, రేసి మధ్య 657 మీటర్ల (2,156 అడుగులు) పొడవుగా, 189 మీటర్ల (620 అడుగులు) ఎత్తుతో అంజి ఖాద్ వంతెన ఉంటుంది.

వాస్తవానికి చీనాబ్ బ్రిడ్జ్ డిసెంబర్ 2009 కి పూర్తయ్యేలా నిర్ణయించబడింది. అయితే, సెప్టెంబర్ 2008 లో చీనాబ్ వంతెన  స్థిరత్వం, భద్రత మీద ఆందోళన చెంది దీనిని రద్దు చేసుకున్నారు. అయితే ఈ వంతెన పని 2010 లో  పునఃప్రారంభించబడింది. మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..