AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: చాప కింద నీరులా మంకీఫాక్స్.. ఢిల్లీలో 5వ పాజిటివ్ కేసు నమోదు..

ఓవైపు కరోనా టెన్షన్. మరోవైపు మంకీఫాక్స్ గుబులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం విధి. మహమ్మారి వ్యాధులు మనుషులపైకి దండెత్తి వస్తున్నాయి. బీ అలెర్ట్.

Monkeypox: చాప కింద నీరులా మంకీఫాక్స్.. ఢిల్లీలో 5వ పాజిటివ్ కేసు నమోదు..
Ram Naramaneni
|

Updated on: Aug 13, 2022 | 3:26 PM

Share

కరోనా(Coronavirus) కేసులు మరోసారి పెరిగిపోతున్నాయి. ఆ టెన్షన్‌తో అల్లాడుతుండగానే.. ఇటు మంకీఫాక్స్ వ్యాప్తి గుబులు రేపుతుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరొకరికి మంకీఫాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది.  డాక్టర్ల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ శనివారం తెలిపారు. 22 ఏళ్ల మహిళ శాంపిల్  శుక్రవారం పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉందని వివరించారు. బాధితురాలికి ఇటీవలి కాలంలో ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తుంది. ఈ ఏడాది జూలై 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీఫాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్‌గా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఢిల్లీలో తొలి కేసు నమోదు అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్టయ్యింది. కేసుల ట్రేసింగ్ కోసం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా ఇండియాలో తొలి మంకీఫాక్స్ కేసు కేరళ(Kerala)లోని కొల్లం జిల్లాలో జూలై 14న నమోదైంది.

ఫీవర్, బాడీ పెయిన్స్, తలనొప్పి అనేవి మంకీఫాక్స్ ప్రధాన సింటమ్స్. ఒంటిపై పొక్కులు కనిపిస్తాయి. దురద ఉంటుంది. వ్యాధి సోకిన మనిషితో సన్నిహితంగా ఉన్నా, వాళ్లు వాడిన వస్తువులు వినియోగించినా.. వారి సమీపంగా ఉన్నా కూడా గాలి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? ఏకంగా దానికే ముప్పు
ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? ఏకంగా దానికే ముప్పు
రామాయణంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందువుల ఆగ్రహం
రామాయణంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందువుల ఆగ్రహం
ఈ 5 పనులు 21 రోజులు చేస్తే.. మీరు లైఫ్ డ్రీమ్ తప్పక నెరవేరుతుంది
ఈ 5 పనులు 21 రోజులు చేస్తే.. మీరు లైఫ్ డ్రీమ్ తప్పక నెరవేరుతుంది
ఆధార్‌ ఉన్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. ఇక మరింత సులభం!
ఆధార్‌ ఉన్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. ఇక మరింత సులభం!
భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
పచ్చి ఉల్లి రోజూ తింటే కలరా, డయాబెటీస్‌, కిడ్నీ వ్యాధులతో సహా..
పచ్చి ఉల్లి రోజూ తింటే కలరా, డయాబెటీస్‌, కిడ్నీ వ్యాధులతో సహా..
స్టార్ హీరో మరణం తర్వాత దొరికిన 64 సూట్‌కేసులు.. లోపల చూసి..
స్టార్ హీరో మరణం తర్వాత దొరికిన 64 సూట్‌కేసులు.. లోపల చూసి..
కేవలం 50 రూపాయలతో.. రోజంతా హెల్తీ డైట్ ప్లాన్ మీ కోసం 
కేవలం 50 రూపాయలతో.. రోజంతా హెల్తీ డైట్ ప్లాన్ మీ కోసం 
టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు..
టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు..
ఒకేరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన!
ఒకేరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన!