Taj Mahal: పర్యాటకులకు గుడ్ న్యూస్.. మూడు రోజుల పాటు తాజ్ మహల్ ఎంట్రీ ఉచితం.. విదేశీయులకు సైతం..
Taj Mahal: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'హర్ గర్ తిరంగా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు...
Taj Mahal: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ గర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరేస్తున్నారు. అలాగే వేడుకల్లో భాగంగా చారిత్రాత్మక స్మారక చిహ్నాలను త్రివర్ణ రంగులతో అలంకరిస్తున్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వచ్చే చారిత్రక కట్టడాల ప్రవేశం ఉచితంగా అందించనున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖ స్మారక చిహ్నం, ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రాంగణంలోకి ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు సందర్శకులందరికీ ఉచిత ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆర్కిలయాలజీకిల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ విషయమై ఆర్డర్ కాపీని అధికారికంగా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే సాధారణంగా తాజ్ మహల్ ప్రవేశానికి విదేశీయులకు ఒక్కొక్కరికి రూ. 1300 కాగా, భారత పర్యాటకులకు రూ. 250గా ఉండేది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా(Agra) నగరంలోని మిగిలిన అన్ని చారిత్రక కట్టడాలను ఉచితంగా చూడవచ్చని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు.
Entry to Taj Mahal, Agra shall continue to remain free for all (both domestic and foreign) from 13th August 2022 to 15th August 2022, except the main Mausoleum in order to effectively manage the visitors at Taj Mahal. #Tajmahal #Agra #AgraNews #AmritMahostav pic.twitter.com/EJlKFosYxb
— Archaeological Survey of India (@ASIGoI) August 12, 2022
అయితే ఫ్రీ ఎంట్రీ కేవలం తాజ్ మహల్ ప్రాంగణంలోకి మాత్రమే వర్తిస్తుంది. ప్రధాన సమాధిన సందర్శించే వారికి వర్తించదు, సందర్శకుల తాకిడిని కంట్రోల్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..