AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌ పోర్టులో ఇద్దరు వ్యక్తుల తత్తరపాటు.. పోలీసులకు అనుమానం! దగ్గరికి వచ్చి ఆరా తీయగా..

విమానం దిగిన ఇద్దరు వ్యక్తులు లగేజీ తీసుకుని తోటి ప్రయాణికులతో కలిసి బయటకు వస్తున్నారు. కానీ వీరి ప్రవర్తన అందరి మాదిరి లేదు. దీంతో అనుమానం వచ్చిన ఎయిర్ పోర్టు పోలీసులు వీరిద్దరినీ పక్కకు పిలిచారు. దీంతో ఆ ఇద్దరిలో తత్తరపాటు మరింత ఎక్కువైంది. ఇక పోలీసులు ఆలస్యం చేయకుండా వారిని తనిఖీ చేయగా..

ఎయిర్‌ పోర్టులో ఇద్దరు వ్యక్తుల తత్తరపాటు.. పోలీసులకు అనుమానం! దగ్గరికి వచ్చి ఆరా తీయగా..
Nepal Airport
Srilakshmi C
|

Updated on: Jun 03, 2025 | 7:40 PM

Share

ఖాట్మాండు, జూన్‌ 3: ఎయిర్‌ పోర్టులో విమానం దిగిన ఇద్దరు వ్యక్తులు లగేజీ తీసుకుని తోటి ప్రయాణికులతో కలిసి బయటకు వస్తున్నారు. కానీ వీరి ప్రవర్తన అందరి మాదిరి లేదు. దీంతో అనుమానం వచ్చిన ఎయిర్ పోర్టు పోలీసులు వీరిద్దరినీ పక్కకు పిలిచారు. దీంతో ఆ ఇద్దరిలో తత్తరపాటు మరింత ఎక్కువైంది. ఇక పోలీసులు ఆలస్యం చేయకుండా వారిని తనిఖీ చేయగా.. లగేజీలో కనిపించింది చూసి పరేషాన్‌ అయ్యారు. ఇంతకీ వారి వద్ద ఏం ఉందంటే..

భారత్‌కు చెందిన ఓ వ్యక్తి నేపాల్‌ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. నేపాల్‌ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్‌ ఎయిర్‌పోర్టులో సోమవారం (జూన్‌ 2) రాత్రి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అక్కడి పోలీసులు వారిని తనిఖీ చేయగా.. తనిఖీలో వారిదగ్గర ఏకంగా 10.420 కిలోల మారిజువానా మత్తు పదార్థం దొరికింది. పట్టుబడ్డ వారిలో ఒకరు భారత్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

దాంతో పోలీసులు వారి వద్ద నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ పోలీసు ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు అరెస్టయిన వ్యక్తులను థాయ్ జాతీయుడు సోమాస్క్ పాచా (43), భారతీయ వ్యక్తి పెరీరా గిఫిన్ (29)గా గుర్తించారు. వీరిద్దరూ బ్యాంకాక్ నుంచి నేపాల్ ఎయిర్‌లైన్స్‌లో డ్రగ్స్‌తో ఖాట్మండు విమానాశ్రయంలో దిగారని తెలిపింది. తదుపరి విచారణ కోసం పోలీసులు నిందితులు ఇద్దరినీ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు