Indian Army: లోతైన లోయలో పడిన ఆర్మీ ట్రక్.. అమరులైన 16 మంది సైనికులు, నలుగురికి గాయాలు

గాయపడిన వారిని ఉత్తర బెంగాల్‌లోని సైనిక ఆసుపత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

Indian Army: లోతైన లోయలో పడిన ఆర్మీ ట్రక్.. అమరులైన 16 మంది సైనికులు, నలుగురికి గాయాలు
Army Vehicle Falls Into Gorge

Updated on: Dec 23, 2022 | 4:46 PM

భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలోని ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. భారత ఆర్మీ ట్రక్కు లోయలో పడి 16 మంది సైనికులు అమరులయ్యారు. శుక్రవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్న ఈ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డుపై నుంచి జారి లోయలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు వీరమరణం పొందగా, నలుగురు సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది.

సీనియర్ పోలీసు అధికారి ప్రమాద ఘటనపై స్పందిస్తూ.. తమకు సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు. క్షతగాత్రులను ఉత్తర బెంగాల్‌లోని సైనిక ఆసుపత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ల సేవలు వారి నిబద్ధతకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు మంత్రి రాజ్ నాథ్ సింగ్.

ఇవి కూడా చదవండి

మీడియా నివేదికల ప్రకారం, రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాచెన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెమా 3 వద్ద ఉదయం 8 గంటలకు ప్రమాదం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..