Zomato: దయచేసి ఆ కామెంట్ చేయకండి, వినియోగదారులకు జొమాటో రిక్వెస్ట్.. ఫైరవుతోన్న నెటిజన్లు.
ఏ సంస్థ అయినా సరే తాము అందించే సేవలు ప్రజలకు ఎంత వరకు అందుతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే సేవల్లో మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. ఇలా ఫీడ్ బ్యాక్‌ను పొందడానికి ఒక్కో సంస్థ..
ఏ సంస్థ అయినా సరే తాము అందించే సేవలు ప్రజలకు ఎంత వరకు అందుతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే సేవల్లో మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. ఇలా ఫీడ్ బ్యాక్‌ను పొందడానికి ఒక్కో సంస్థ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంది. యాప్‌ల ద్వారా సేవలు అందిస్తోన్న సంస్థలు ఆన్‌లైన్‌లోనే యూజర్ల ఫీడ్ బ్యాక్‌ను తెలుసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ‘కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్’ పేరుతో ఓ కాలమ్‌ను నిర్వహిస్తోంది. దీంట్లో యూజర్లు ఫుడ్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు.
అయితే తాజాగా ఈ కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ విషయంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ విషయంలో కస్టమర్లు అదే పనిగా చేస్తోన్న ఓ కామెంట్‌ను దయచేసి ట్వీట్ చేయొద్దంటూ ట్వీట్ చేసింది. ‘భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’ అనే కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను ట్వీట్ చేయొద్దంటూ జొమాటో ట్వీట్ చేసింది. అయితే జొమాటో చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది.
guys please stop writing “bhaiya accha banana” as cooking instructions ?♂️
— zomato (@zomato) December 22, 2022
జొమాటో ట్వీట్‌కు భారీగా నెగిటివ్ రీట్వీట్స్ వస్తున్నాయి. ఇంత మాత్రం దానికి కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్ కాలమ్‌ను ఎందుకు ఇచ్చినట్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కస్టమర్ల ఫీడ్ బ్యాక్‌కు అనుగుణంగా ఫుడ్ మేకింగ్‌లో మార్పులు తీసుకురావాలని కానీ, కామెంట్ చేయకూడదు అని చెప్పడం ఏంటంటూ జొమాటోపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..