
జీ 20 సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు. విదేశీ అతిథులు వచ్చే చోట భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈవెంట్ యొక్క అందాన్ని జోడించడమే కాకుండా.. భారతదేశ గొప్ప సంస్కృతిని, చారిత్రక వారసత్వం గురించి ప్రపంచానికి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. భారత్.. ఇంతమంది దేశాధినేతలకు తన సంస్కృతిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు జీ20 సదస్సుకు వేదికైన భారత మండపంలో.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన కోణార్క్ చక్రాన్ని ప్రదర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ అతిథులకు వివరించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించబడింది. ఈ చక్రం భారతదేశ ప్రాచీన జ్ఞానం, నాగరికత, వాస్తుశిల్పం ఔన్నత్యానికి చిహ్నం. కోణార్క్ చక్రం యొక్క భ్రమణం కాలచక్రంతో పాటు పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య చక్రానికి శక్తివంతమైన చిహ్నంగా కూడా పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్య ఆదర్శాలకు, సమాజంలో పురోగతి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అయితే ఈ చక్రం ఒడిశాలోని కోణార్క్‌లో ఉన్న సూర్య దేవాలయంలో నిర్మించారు. భారత కరెన్సీ నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్ర ముద్రించబడి ఉండటాన్ని మనం చూడచ్చు. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ముద్రించి, ఆపై 10 రూపాయల నోటుపై ముద్రించేవారు. కోణార్క్ చక్రం 8 వెడల్పు చువ్వలు.. అలాగే 8 సన్నని చువ్వలు కలిగి ఉంటుంది. ఆలయంలో 24 (12 జతల) చక్రాలు ఉన్నాయి. ఇవి సూర్యుని రథ చక్రాలను సూచిస్తాయి. 8 కర్రలు రోజులోని 8 గంటల గురించి చెబుతాయి. దీన్ని ఉపయోగించి, సూర్యుని స్థానం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారని నమ్ముతారు. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని మరియు 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని కూడా నమ్ముతారు.
ఇదిలా జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. భారత్ మండపంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వారందరికి స్వాగతం పలికారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మరో విషయం ఏంటంటే కొత్తగా జీ20లో సభ్యత్వం సాధించిన ఆఫ్రికా యూనియన్ అధినేతనకు ప్రధాని స్వాగతం తెలిపారు. ఆయన్ని ఆలింగనం చేసుకోని కూరిచులో కూర్చోబెట్టారు. మరోవైపు ప్రధాని మోదీ కూర్చున్నటువంటి టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌పై భారత్ అని రాసి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరును భారత్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చనుందని జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే భారత్‌ను ఇండియాగా గుర్తించేవారు. అయితే ఇప్పుడు తొలిసారిగా ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాకు బదులుగా భారత్ అని గుర్తిస్తూ రౌండ్ టేబుల్‌పై భారత్ అనే నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ భారత్ మిమ్మల్ని స్వాగతిస్తుందని అన్నారు.
Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL
— Narendra Modi (@narendramodi) September 9, 2023
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జీ20 సదస్సుపై ట్విట్టర్ వేదికగా మరోసారి కీలక కామెంట్స్ చేశారు. ఒడిశా రాష్ట్రాం సంస్కృతి, వారసత్వానికి జీ20 సదస్సులో గర్వించదగిన స్థానం కలిగిందని చెప్పారు. కోణార్క్ చక్ర అనేది భావి, భవిష్యత్తు తరాలకు సంబంధించిన నాగరికత భవనాలను వివరించే ఓ నిర్మాణ అద్భుతమన్న ధర్మేంద్ర ప్రధాన్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారతదేశ వారసత్వం, విజ్ఞాన సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించడం.. ఓ అందమైన దృశ్యంగా ఉందని కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.
Odisha’s magnificent culture and heritage finds a place of pride at #G20India.
The Konark chakra is an architectural marvel illustrating the civilisational concepts of time, space, continuity and the future.
PM @narendramodi explaining the significance of India’s heritage and… pic.twitter.com/X4esZxsi3j
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 9, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..