Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 46,951 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నుంచి భారత్‌లో హయ్యస్ట్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,46,081కి చేరింది. ఇందులో 3,34,646 యాక్టివ్ కేసులు ఉండగా, 1,11,51,468 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 212 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,59,967కి చేరుకుంది. నిన్న కొత్తగా 21,180 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మునపటి కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 30,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 1875 కొత్త కేసులు బయటపడగా, కర్ణాటకలో 1,715 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!