India Coronavirus: దేశంలో తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

India Covid-19 Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా..

India Coronavirus: దేశంలో తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?
India Corona

Updated on: Mar 16, 2022 | 10:02 AM

India Covid-19 Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా.. మరణాలు కూడా భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం దేశవ్యాప్తంగా 2,876 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.38 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 32,811 (0.08%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,24,53,939 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,072 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 3,884 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,50,055 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.72 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,80,60,93,107 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న 7,52,818 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.05 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

Also Read:

AP Crime News: ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడని వ్యక్తి ఆత్మహత్య.. కుటుంబసభ్యుల ఆందోళన

Telangana: వనపర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..

AP Crime News: అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తెల్లవారుజామునే మాటువేసి..