India Covid-19 Updates: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచిఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వేయికి అటుఇటుగా నమోదైన (Coronavirus) కేసులు.. మళ్లీ ఒక్కసారిగా రెండు వేల మార్క్ దాటాయి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసు పాటిజివిటీ రేటు ఒక్కసారిగా పెరుగుతుంటడంతో కేంద్రం అప్రమత్తమైంది. జనవరి తర్వాత పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుంది. ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో కేసులు రెండింతలు పెరిగాయి. యూపీలో 141%, హర్యానాలో 118% మేర కేసులు పెరిగాయి. దీంతోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా 11 వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు కాస్త.. ఆదివారం ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఫోర్త్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/vPyEpPEf6j pic.twitter.com/v2bjsUxb23
— Ministry of Health (@MoHFW_INDIA) April 18, 2022
Also Read: