Corona Cases India: దేశంలో కొత్తగా 13083 పాజిటివ్ కేసులు, 137 మరణాలు… పెరుగుతోన్న రికవరీ రేటు..
Corona Cases India: దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,083 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం పాజిటివ్..

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,083 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,33,131కి చేరింది. నిన్న కొత్తగా 14,808 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,04,09,160 కోలుకున్నారు. కాగా, బుధవారం ఒక్కరోజే 137 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,54,147కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,69,824 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో దేశంలో 14 రోజుల్లో 33 లక్షల మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.




