Keeping Constant Watch: భారత భూభాగంలో చైనా నిర్మాణ పనులపై స్పందించిన భారత విదేశాంగ శాఖ
Keeping Constant Watch: భారత భూభాగంలో చైనా ఓ గ్రామం నిర్మించిందన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ సోమవారం స్పందించింది. భారత దేశ భద్రతపై ప్రభావం చూపే..
Keeping Constant Watch: భారత భూభాగంలో చైనా ఓ గ్రామం నిర్మించిందన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ సోమవారం స్పందించింది. భారత దేశ భద్రతపై ప్రభావం చూపే ప్రతి అంశాన్ని తాము నిశితంగా గమనిస్తూనే ఉన్నామని తెలిపింది. చైనా వ్యవహారాలన్నింటిని గమనిస్తూనే ఉన్నామని తెలిపింది. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసింది.
భారత భూభాగంలో చైనా నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికను చూశాం. కొన్నేళ్లుగా చైనా ఇలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యకలాపాలను చేపడుతూనే ఉంది. దీనికి విరుగుడుగా భారత సర్కార్ సరిహద్దు ప్రదేశాలలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తోంది. రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలను త్వరితగతిన చేపడుతున్నాం అని విదేశాంగ శాఖ తెలిపింది.
చైనా భారత భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందనే వార్త జాతీయ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత భూభాగంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఎగువ సుబన్‌సిరి జిల్లాలోని వివాదస్పద ప్రాంతంలో ఏకంగా 101 ఇళ్లు నిర్మించినట్లు తెలుస్తోంది. భారత భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేకసార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించుకుంది. గతంలో ఇక్కడ పలుమార్లు హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. చైనా ఈ గ్రామం నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చెబుతున్నారు. 2019 ఆగస్టు నాటి చిత్రాలతో పోలిస్తే గత సంవత్సరం నవంబర్‌లో ఈ ప్రాంతంలో ఏకంగా 101 నిర్మాణాలు కనిపించాయి. ఈ చిత్రాలను బట్టి గత ఏడాది ఈ గ్రామం నిర్మాణం అయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Corona Fear: కరోనా భయం.. మూడు నెలలు ఎయిర్‌పోర్టులో దాక్కున్న వ్యక్తి.. అరెస్టు చేసిన పోలీసులు