India To Sell Tejas Fighter: ఇప్పటి వరకూ రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడిన భారత దేశం.. క్రమంగా స్వదేశీ తయారీపై ఆధారపడాని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.. అందుకు అనుగుణంగా స్వదేశీ విమానాల తయారీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మన శాస్త్రజ్ఞులు రక్షణ రంగంలో ఉపయోగించే అనేక రకాల ఆయుధ సామాగ్రిని, విమానాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్.. తేజాస్ పేరుతో యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. మన దేశం తయారు చేస్తోన్న యుద్ధ విమానాలను అమ్మడానికి కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధవిమానాలను కొనేందుకు మలేషియా దేశం ఆసక్తిని చూపిస్తోంది. తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సిఎ) “తేజాస్” 18 ట్రైనర్ వేరియంట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలను రాయల్ మలేసియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ పంపింది. దీనికి భారత్ సానుకూలంగా స్పందించింది.
1983 తర్వాత ఈ తరహాలో విమానాలు తయారు చేయడం ఇదే మొదటిసారి. ఈ యుద్ధ విమానాలపై ఇతర దేశాలు దృష్టి పెట్టాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్‌లు కూడా ఆసక్తి చూపుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 83 తేజస్ జెట్‌ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు $6 బిలియన్ల కాంట్రాక్టును ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ సంస్థ హెచ్ఏఎల్.. తేజాస్ పేరుతో యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది.
విదేశీ రక్షణ పరికరాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా జెట్‌లను ఎగుమతి చేసేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది. భారత్ సొంత యుద్ధ విమానాల తయారీపై దృష్టి పెట్టడంతో ఇతర దేశాలు కూడా ఈ విషయంలో సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. సొంతంగా యుద్ధ విమానాలను తయారు చేయాలన్న భారత్ లక్ష్యానికి తమ మద్దతు ఉంటుందని ఏప్రిల్‌లో బ్రిటన్ తెలిపింది. రష్యా కూడా మన దేశంలోనే విమానాలు తయారు చేసి ఇస్తామని, దీనికి సంబంధించిన సాంకేతికతను కూడా అందిస్తామని ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..