Corona New Variant: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సెకండ్ వేవ్ పై పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రెండో దశ వైరస్ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావం ఉందని తేలింది. అలాగే రెండో దశ వైరస్…ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాపిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి. రెండో దశలో అనేకమంది వైరస్ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనం అని టీఐఎఫ్ఆర్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సందీప్ జునేజా తెలిపారు. అటు ముంబైలో కరోనా మరణాలు అధికంగా నమోదు కావడంపై పరిశోధనలు జరుపుతున్నట్లు సర్వే తెలిపింది.
మహారాష్ట్రలో రెండో దశ వైరస్ ఫిబ్రవరి నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించడంతో అది విజృంభించిందని సర్వేలో తేలింది. మే మొదటి వారంలో ముంబైలో మరణాలు అధికంగా ఉంటాయని, వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగితే జూన్ 1 నాటికి మరణాల సంఖ్య తగ్గుతుందని సర్వేలో స్పష్టమైంది.
Also Read:
Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?
Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!