పాక్‌కు చెక్‌ పెట్టేందుకు సరిహద్దుల్లో భారత్‌ అధునాతన జామర్లు.. ఇవి దేనికి ఉపయోగిస్తారు.. ఏలా పనిచేస్తాయి!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాదిలో భారత్‌కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో.. ఈ ఉగ్రదాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంతో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్‌ ఆర్మీ కాశ్మీర్‌ సహద్దుల వద్ద కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. ఇక పాక్‌ ఎత్తుడగలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్‌ త్రివిద దళాలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లను అడ్డుకోకునేందుకు జామర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

పాక్‌కు చెక్‌ పెట్టేందుకు సరిహద్దుల్లో భారత్‌ అధునాతన జామర్లు.. ఇవి దేనికి ఉపయోగిస్తారు.. ఏలా పనిచేస్తాయి!
India

Edited By:

Updated on: May 01, 2025 | 11:19 AM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాదిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో.. ఈ ఉగ్రదాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంతో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్‌ ఆర్మీ కాశ్మీర్‌ సహద్దుల వద్ద కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. ఇక పాక్‌ ఎత్తుడగలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్‌ త్రివిద దళాలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. ఒకవేళ పాకిస్తాన్ గగనతలం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడితే.. పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. భారత్ ఉపయోగించే జామర్ వ్యవస్థలు పాకిస్థాన్ వైమానిక నావిగేషన్‌ను దెబ్బతీయడం ద్వారా ఆ దేశా దాడి సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది.

పాకిస్థాన్ సైనిక విమానాలు, డ్రోన్‌లు, గైడెడ్ మిస్సైళ్లు వంటి గగనతల ఆయుధాలు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లపై ఆధారపడి ఉంటాయి. భారత్ ఇప్పుడు ఈ సిగ్నల్‌లను జామ్ చేయడం ద్వారా పాకిస్థాన్ నావిగేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. భారత జామర్లు అమెరికాకు చెందిన GPS వ్యవస్థతో పాటు, రష్యాకు చెందిన (GLONASS), చైనాకు చెందిన బీడౌ వంటి నావిగేషన్ వ్యవస్థల సిగ్నల్‌లను కూడా అడ్డుకుంటాయి.

భారత్ తన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW) సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, సమ్యుక్త EW సిస్టమ్, హిమ్‌శక్తి EW సిస్టమ్, రాఫెల్ జెట్‌లపై స్పెక్ట్రా సూట్‌లు, యుద్ధ నౌకలపై నావల్ EW సిస్టమ్‌లు, కాళీ-5000 వంటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్‌లను మోహరించింది. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో సమాచార రాడార్‌లను అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

మరోవైపు, పాకిస్థాన్ తన EW సామర్థ్యాల కోసం చైనాపై ఆధారపడుతోంది. ఇందులో జర్బ్ కోస్టల్ EW సిస్టమ్ , JF-17 ఫైటర్ జెట్‌లపై ఎయిర్‌బోర్న్ EW ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈ చర్యలతో భారత్, పాకిస్థాన్‌పై ఎలక్ట్రానిక్ యుద్ధంలో ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఈ సిగ్నల్ జామింగ్ వల్ల పౌర విమానాలు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలపై కూడా ప్రభావం పడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..