దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,52,950కి చేరింది. ఇందులో 4,58,727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 44,459 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,98,88,284కి చేరింది.
అటు గురువారం 911 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,05,939 చేరుకుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37 కోట్లకుపైగా చేరువలో కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.19 శాతంగా ఉందని.. అలాగే మరణాల రేటు 1.32 శాతంగా ఉందని పేర్కొంది. కాగా, గురువారం రాత్రి 7 గంటల వరకు.. ఒక్కరోజు దేశవ్యాప్తంగా 36.08 లక్షలకుపైగా మోతాదులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 18-44 సంవత్సరాల వరకు 10,82,14.937 మందికి మొదటి డోసు అందించగా.. మరో 33,70,920 మందికి రెండో డోసు అందించినట్లు తెలిపింది.
Also Read:
రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!
మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!