కోవిడ్ రోగుల చికిత్సలో రోచె ఇండియా సంస్థ వారి యాంటీబాడీ కాక్ టెయిల్ డ్రగ్ ..’కెసిరివిమాబ్’, ‘ఇమ్డెవిమాబ్’ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతించింది. రోచెతో బాటు రెజినిరాన్ సంస్థ కూడా ఈ కాక్ టెయిల్ మందులను ఉత్పత్తి చేస్తోంది. యూఎస్ రెగ్యులేటర్లతో సహా యూరోపియన్ రెగ్యులేటరీ పానెల్ సేకరించిన డేటా ఆధారంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ కాక్ టెయిల్ మెడిసిన్స్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. సెకండ్ కోవిడ్ పై భారత్ జరుపుతున్న పోరుకు ఈ మందులు మరింత తోడ్పడతాయని భావిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లోగడ కరోనా వైరస్ పాజిటివ్ కి గురయినప్పుడు ఆయనకు ఈ యాంటీ బాడీ ట్రీట్ మెంట్ ను ఇచ్చారని తెలిసింది. ఈ మందులను సిప్లా కంపెనీ భాగస్వామ్యంతో రోచె సంస్థ ఇండియాలో పంపిణీ చేయనుంది. ఈ సంస్థ పేటెంట్ పొందిన యాంటీ బాడీ మందు టోసిలిజుమాబ్ మెడిసిన్ ని కూడా సిప్లా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.రెండు యాంటీ బాడీల కాక్ టెయిల్ థెరపీ కోవిడ్ రోగుల చికిత్సకు దోహద పడుతుందని భావిస్తున్నారు.
హై రిస్క్ ఉన్న రోగులు ఈ మెడిసిన్స్ వల్ల హాస్పిటల్స్ లో చేరే పరిస్థితి చాలావరకు తగ్గుతుందని అంటున్నారు. అయితే ఈ మెడిసిన్ ను లాంచ్ చేసే తేదీనిగానీ, ధరను గానీ కంపెనీ నిర్ణయించలేదు. గత 10 రోజుల్లో దేశంలో 33 వేలమందికి పైగా కోవిద్ రోగులు మరణించారు. కోవిద్ మందుల కొరత కూడా ఎక్కువగా ఉంది. రెమ్ డెసివిర్ తో బాటు రోచె వారి టోసిలిజుమాబ్ మందు కొరత కూడా తీవ్రంగా ఉంది. అయితే మందుల ఉత్పత్తిని పెంచుతామని ప్రభుత్వం, స్థానిక ఉత్పత్తిదారులు కూడా అంటున్నారు. ఎలీ లిల్లీ సంస్థ డెవలప్ చేసిన బెరిసెటివిచ్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించినట్టు నాట్కో ఫార్మా ప్రకటించింది.
కాగా ఇండియాలో తాజాగా కోవిద్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటిపోయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : ఊరు ఊరంతా ఐసోలేషన్!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral
viral video: రెండో ఎక్కం కూడా రాని వరుడు.. పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!