PM Modi Japan Tour: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండ్రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను జపాన్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న వారి నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి జపాన్‌లో భారతీయులు ఉన్నారని అన్నారు. జపాన్ సంస్కృతిని అలవరుచుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి, భాషను కూడా జాగ్రత్తగా కాపాడుతున్నారని ప్రశంసించారు. ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో సభా స్థలి దగ్గర ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీ మోడీ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
గౌతమ బుద్దుడితో జపాన్‌కు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. కాశీ పునర్‌నిర్మాణంలో జపాన్ సాయానికి ధన్యవాదాలు తెలిపారు. భారత్-జపాన్ సహజ మిత్రులని అన్నారు. దేశ పురోగతిలో జపాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. యుద్దకాలంలో బౌద్దమే శరణ్యమన్నారు మోదీ. చికాగో వెళ్లేందుకు ముందు జపాన్‌లో పర్యటించిన స్వామి వివేకానంద.. ఆ దేశం గురించి గొప్ప అభిప్రాయాన్ని పొందారని గుర్తుచేశారు. జపాన్ ప్రజల దేశ భక్తి, ఆత్మస్థైర్యం, పారిశుద్ధ్యంపై అవగాహనను స్వామి వివేకానంద కొనియాడారని అన్నారు.
#WATCH | With chants of “Modi Modi & Jai Shri Ram,” PM Modi was welcomed by the Indian diaspora in Tokyo, Japan pic.twitter.com/vPw714TWpm
— ANI (@ANI) May 23, 2022
గత 100 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద సంక్షోభానికి కరోనా కారణమయ్యిందన్నారు. కరోనా మొదలైనప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వ్యాక్సిన్ వస్తుందో రాదో కూడా తెలీదన్నారు. అయితే ఈ సంక్షోభాన్ని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో భారత్ 100కు పైగా దేశాలకు టీకాలు సరఫరా చేసిందన్నారు.
Grateful to the Indian community in Japan for their warm reception. Addressing a programme in Tokyo. https://t.co/IQrbSvVrns
— Narendra Modi (@narendramodi) May 23, 2022
గత ఎనిమిదేళ్లలో భారత దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..