Independence Day 2024: సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ మార్చేసిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం పెట్టారో తెలుసా?

|

Aug 09, 2024 | 12:34 PM

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో పాల్గొనాలని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతే కాకుండా మోదీ తన సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా మార్చేశారు. మోదీ ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌లో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొనాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం..

Independence Day 2024: సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ మార్చేసిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం పెట్టారో తెలుసా?
PM Narendra Modi
Follow us on

ఢిల్లీ, ఆగస్టు 9: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో పాల్గొనాలని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతే కాకుండా మోదీ తన సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా మార్చేశారు. మోదీ ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌లో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొనాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి హర్ ఘర్ తిరంగా అభియాన్‌ను ఓ చిరస్మరణీయ ప్రజా ఉద్యమంగా మారుద్దామని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. నేను నా ప్రొఫైల్ ఫోటోను మారుస్తున్నాను. మీరు మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించేందుకు నాతో చేతులు కలపండి అంటూ మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు. స్వాతంత్ర్య మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే నినాదాన్ని ప్రారంభించింది. ఇది ఆగస్టు 15తో ముగుస్తుంది. ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని అధికార బీజేపీ పార్టీ కార్యకర్తలను కోరింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రధాని మోదీ శుక్రవారం (ఆగస్టు 9) నివాళులర్పిస్తూ మన స్వాతంత్య్ర పోరాటంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉద్యమం ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం 82వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ‘X’ ఖాతాలో పోస్ట్‌ పెట్టారు. ‘బాపు నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ వందనాలు. మన స్వాతంత్ర్య పోరాటంలో ఇదొక చారిత్రక ఘట్టం’ అని ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

హర్ ఘర్ తిరంగా ప్రచారం అంటే ఏమిటి?

స్వాతంత్ర్య అమృత మహోత్సవ అభియాన్ కింద జూలై 22, 2022 నుంచి మోదీ సర్కార్‌ ఈ ప్రచారం ప్రారంభించింది. త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్ల వద్ద ఎగురవేయాలని స్వయంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను అభ్యర్థించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. 1947లో ఇదే రోజున (జూలై 22న) త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.