AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు పన్ను మినహాయింపు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు సంపాదించే జీతభత్యాలపై భారతదేశంలో పన్ను మినహాయింపు కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పష్టం చేశారు.

గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు పన్ను మినహాయింపు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman
Balaraju Goud
|

Updated on: Apr 02, 2021 | 7:30 PM

Share

Nirmala sitharaman on Gulf NRI: గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు సంపాదించే జీతభత్యాలపై భారతదేశంలో పన్ను మినహాయింపు కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పష్టం చేశారు. ఆర్థిక చట్టం 2021 సవరణలో భాగంగా గల్ఫ్‌ కార్మికుల ప్రత్యేక పన్నును ప్రస్తావిస్తూ.. గల్ఫ్‌లోని భారత కార్మికులపై అదనపు పన్నును విధించనున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహుమోయిత్రా చేసిన ట్వీట్‌కు మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్‌ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికులపై ఆర్థిక బిల్లు 2021లో కొత్తగా అదనపు పన్నును ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు.

ఆదాయ పన్ను చట్టంలో స్పష్టత కోసం పన్నుకు బాధ్యులు అన్న నిర్వచనాన్ని బిల్లులో ఇచ్చినట్టు చెప్పారు. ‘‘గల్ఫ్‌ దేశాల్లో భారత ఎన్‌ఆర్‌ఐ కార్మికులు ఆర్జిస్తున్న వేతనంపై పన్ను అంశంలో ఎంటువంటి మార్పు లేదు. వారి వేతనంపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుంది’’ అంటూ తన ట్వీట్‌లో మంత్రి సీతారామన్‌ స్పష్టత ఇచ్చారు. తప్పుదోవ పట్టించడమే కాకుండా.. ప్రజల్లో అనవసర భయాలను కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాలలో సంపాదించిన వారి జీతం ఆదాయం భారతదేశంలో మినహాయింపుగా కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.” సౌదీ, యుఏఈ, ఒమన్, ఖతార్‌లోని కష్టపడి పనిచేసే భారతీయ కార్మికులపై ఆర్థిక చట్టం, 2021 అదనపు లేదా కొత్త పన్నును తీసుకురాలేదు.ఇది కేవలం ఆదాయపు పన్ను చట్టంలో “పన్నుకు బాధ్యత” అనే పదానికి సాధారణ నిర్వచనాన్ని పొందుపరచడం జరిగిందని”ఆమె చెప్పారు.

వాస్తవాలను అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి బాధ్యత కలిగిన టీఎంసీ ఎంపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై పేర్కొనడం తప్పుదారి పట్టించడమే కాకుండా ప్రజలలో అవాంఛిత భయాందోళనలను సృష్టిస్తుందని నిర్మలా సీతారామన్ ఆందోళ వ్యక్తం చేశారు.

Read Also… Diet After Corona Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి డైట్ చార్ట్‌ .. ఏ సమయంలో ఏమి తినాలో సూచించిన పౌష్టికార నిపుణులు ‌