Uttar Pradesh: స్టూడెంట్‌ని తోటి విద్యార్ధులతో కొట్టించిన టీచర్.. సంచలనం సృష్టిస్తున్న ఘటన..
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ స్టూడెంట్‌ను టీచర్ తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటనపై దేశమంతా దుమారం చెలరేగుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించారు. ఇందులో టీచర్.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా..

ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ స్టూడెంట్‌ను టీచర్ తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటనపై దేశమంతా దుమారం చెలరేగుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించారు. ఇందులో టీచర్.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా టీచర్ వ్యవహరించడం రాజకీయ దుమారాన్ని రేపింది.
యూపీలో పాలనకు ఈ ఘటన అద్దం పడుతోందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. దేవాలయంగా భావించే పవిత్రమైన పాఠశాలలో విద్యార్థుల్లో విద్వేషాలను నింపుతున్నారని.. అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే ఈ ఘటనపై స్పందించారు పిల్లాడిని కొట్టించిన టీచర్ త్రిప్తా త్యాగి. విద్యార్థిపై దాడి చేసిన చర్యను ఆమె సమర్థించుకున్నారు. బాధితుడు 5వ గుణితం నేర్చుకోవాలని చెప్పానని.. సెలవులు వచ్చినా నేర్చుకోలేదని అన్నారు. అందుకే ఇతర విద్యార్థులతో కొట్టించానన్నారు. ఈ ఘటనలో మతపరమైన కోణాన్ని ఆమె కొట్టిపారేశారు. చిన్న అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. ఇలాంటి చిన్న విషయాలను రాజకీయం చేస్తే టీచర్లు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.




బాలుడు తన హోంవర్క్ చేయనందున అతన్ని కొట్టమని కొంతమంది విద్యార్థులను కోరినట్లు చెప్పారు. అతనితో కఠినంగా ఉండమని పిల్లల తల్లిదండ్రుల నుంచే ఒత్తిడి వచ్చిందన్నారు. తాను దివ్యాంగురాలు అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులతో కొట్టించానని చెప్పుకొచ్చారు. అయితే వీడియోను ఎడిట్ చేసి మతపరమైన కోణం వచ్చేలా బయడకు విడుదల చేశారని ఆమె ఆరోపించారు. విద్యార్ధి బంధువు క్లాస్‌లో కూర్చొని ఆ వీడియోను అతను రికార్డ్ చేశాడని, తరువాత దానిని ఎడిట్ చేశాడని ఆన్నారు. విద్యార్ధిని ఉద్ధేశపూర్వకంగా కొట్టించలేదని.. తన తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు.
‘బాగా చదివేలా చూడాలని ఆ బాలుడి పేరంట్స్ కోరారు. నేను దివ్యాంగురాలిని కావడంతో తోటి పిల్లలతో కొట్టించాను. రెండు నెలల నుంచి పిల్లాడు చదవడం లేదని తల్లిదండ్రులు నాతో చెప్పడంతో అలా చేశాను. ఇద్దరు.. ముగ్గురు పిల్లలు అతడిని కొట్టారు. బాలుడి బాబాయి అక్కడే ఉండి వీడియో చేసి వైరల్ చేశాడు’ అని టీచర్ తెలిపింది. కాగా, ముజఫర్ నగర్ వీడియోలో చెంప దెబ్బ కొట్టిన విద్యార్ధులతో బాధితుడిని కౌగించుకునేలా చేశారు రైతు సంఘాల నాయకుడు నరేష్ తికాయత్. అందరూ ద్వేషాన్ని వదిలేసి సోదరభావాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.
కాగా, మన్సూర్‌పూర్ పోలీసులు సదరు టీచర్‌పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా ఎస్పీ సత్యనారాయణ ప్రజాపతి తెలిపారు.
जिन मोहम्मडन बच्चों की माँ बच्चों की पढ़ाई पर ध्यान नहीं देती, उन बच्चों का नास हो जाता है…
The teacher in Muzaffarnagar seems to have said (it can also be heard in the video in circulation), while asking other students in the class to hit the boy, as punishment, for not having… pic.twitter.com/F95ZFU9IbE
— Amit Malviya (@amitmalviya) August 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..