Gujarat: కేరళను మించిన దుర్గటన.. ఎవరో చెప్పారని కన్న కూతురునే బలిచ్చిన తండ్రి..

దెయ్యం ఆకలితీర్చితే అతీంద్రియశక్తులు సిద్ధిస్తాయా? నరబలి ఇస్తే ఎక్కడ లేని శక్తులు ఆవహిస్తాయా? అసలు విజ్ఞాన కాలంలో అజ్ఞాన పనులకు కారణం మూర్ఖత్వమా..

Gujarat: కేరళను మించిన దుర్గటన.. ఎవరో చెప్పారని కన్న కూతురునే బలిచ్చిన తండ్రి..
Gujarat Man Kills Daughter

Updated on: Oct 14, 2022 | 9:40 AM

దెయ్యం ఆకలితీర్చితే అతీంద్రియశక్తులు సిద్ధిస్తాయా? నరబలి ఇస్తే ఎక్కడ లేని శక్తులు ఆవహిస్తాయా? అసలు విజ్ఞాన కాలంలో అజ్ఞాన పనులకు కారణం మూర్ఖత్వమా.. మూఢత్వమా.. లేదంటే అంతుకు మించా? నిన్న గాక మొన్న కేరళలో నరబలుల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. తాజాగా గుజరాత్ ఉదంతం హడలెత్తిస్తోంది.

ప్రపంచం 5జీ టెక్నాలజీలోకి అడుగుపెట్టింది. అత్యాధునిక ఆవిష్కరణలతో దేశం వేగంగా పరుగులు పెడుతోంది. కానీ కొన్ని చోట్ల.. మూర్ఖత్వం ఇంకా జడలు విప్పుతూనే ఉంది. మూఢనమ్మకాలతో అమాయకుల బలులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. సోమనాథ్ జిల్లాలోని ధావా గ్రామంలో కన్నకూతుర్ని నరబలి ఇచ్చాడు తండ్రి భవేష్ అక్బరీ. ఏవో పిచ్చి పూజలు చేసిన అక్బరీ.. అతని 14 ఏళ్ల కూతరుతోనూ చేయించాడు. ఆ తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా అమ్మాయిని అగ్నిగుండలోకి తోసేశాడు. నిముషాల్లోనే ఆ అమ్మాయి సజీవ దహనం అయ్యింది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. అతని తమ్ముడు కూడా ఈ బలిలో పాలుపంచుకున్నాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని క్షుద్రపూజల పేరుతో బాలికను బలి తీసుకున్న అక్బరీ, అతని తమ్ముడిని అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరినీ విచారించిన పోలీసులకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. దెయ్యాలకు కన్య పిల్లను బలిస్తే అతీంద్రీయ శక్తులు వస్తాయని, బాలిక మళ్లీ బతికి వస్తుందని ఎవరో చెప్పారట. ఆ కారణంగానే క్షుద్రపూజలు చేసిన తన కూతురుని బలి ఇచ్చిన అక్బరీ చెప్పుకొచ్చాడు. ఈ తతంతగంపై ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆకలి దెయ్యాలదో, ఆ తండ్రి రూప రాక్షసుడిదో గానీ.. చివరికి అభంశుభం తెలియని ఓ బాలిక బూడిదైంది. మొన్నటికి మొన్న కేరళలో ఓ దంపతులు ఏకంగా మనుషుల్ని చంపి వండుకుతిన్నారు. సంచలనంగా మారిన ఈ కేసులో ప్రధాన నిందితుడైన రషీద్‌.. తర్వాత టార్గెట్‌ లైలా భర్త భగవల్‌ సింగ్‌ అయ్యుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భగవల్‌ సింగ్‌ను హతమార్చి లైలాతో కలిసి జీవించేందుకు పన్నాగం పన్ని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నరబలి కేసులో వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..