Helicopter Ride: మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి.. టాపర్లకు హెలికాప్టర్ రైడ్.. ఆనందంతో పొంగిపోయిన స్టూడెంట్స్..
కాలేజీలో టాపర్ గా నిలిచిన వారికి సాధారణంగా అందరి ముందు అభినందించడం గానీ, వారికి నగదు ప్రోత్సాహకం గానీ అందజేస్తుంటారు. ఇలా చేస్తే వారు ఇంకా బాగా చదువుకుంటారని భావిస్తుంటారు. కొంత వరకు...

కాలేజీలో టాపర్ గా నిలిచిన వారికి సాధారణంగా అందరి ముందు అభినందించడం గానీ, వారికి నగదు ప్రోత్సాహకం గానీ అందజేస్తుంటారు. ఇలా చేస్తే వారు ఇంకా బాగా చదువుకుంటారని భావిస్తుంటారు. కొంత వరకు ఇది నిజం కూడా. విద్యార్థులు మంచి మంచి విజయాలు సాధించేందుకు గిఫ్ట్ లు ఉపయోగపడతాయి. అయితే ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చదువులో టాపర్లుగా నిలిచిన వారితో హెలికాప్టర్ రైడ్ చేయించారు. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్ లో తిప్పించారు. సీఎం చేసిన ఈ పనికి విద్యార్థులు ఆనందంతో పొంగిపోయారు. తొలిసారి గాల్లో ప్రయాణించామని, చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పుతామని గతంలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గగన విహారం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని స్పష్టం చేశారు.
విద్యార్థులను హెలికాప్టర్ లో తిప్పడం పట్ల ముఖ్యమంత్రి బఘేల్ మరోసారి స్పందించారు. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. 10, 12 తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్‌లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని వెల్లడించారు. మొత్తం 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారని తెలిపారు. కాగా.. గతంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10, 12 బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెలికాప్టర్‌లో షికారు చేసే అవకాశాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
విమాన ప్రయాణం చేయాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుందని, హెలికాప్టర్‌లో ప్రయాణించవచ్చన్న కోరిక విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. తద్వారా వారు చదువులో రాణిస్తారని ఆశిస్తున్నాం. ఇది వారి ఉన్నత లక్ష్యాల సాధనకు పురిగొల్పుతుందని భావిస్తున్నాం.




– భూపేశ్ భఘేల్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..