ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్..IMA కీలక నిర్ణయం..!

|

Aug 16, 2024 | 5:30 PM

డాక్టర్ల నిరసనల్లో భాగంగా ఆగస్టు 17న ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ మెడికల్ సేవలను బంద్ చేయాలని ఐఎంఏ నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు తప్ప ఇతరత్రా వైద్య సేవలు 24 గంటల పాటు నిలిచిపోనున్నాయి. మెజారిటీ డాక్టర్లు ఆగస్ట్ 17న స్రైక్లో ఉంటారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోనూ..

ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్..IMA కీలక నిర్ణయం..!
Doctors' Strike
Follow us on

పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతాలో జరిగిన దారుణ ఘటన యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. జూనియర్‌ డాక్టర్‌పై మెడికల్ ఆస్పత్రిలోనే జరిగిన ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన చేపట్టారు. మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ల నిరసనల్లో భాగంగా ఆగస్టు 17న ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ మెడికల్ సేవలను బంద్ చేయాలని ఐఎంఏ నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు తప్ప ఇతరత్రా వైద్య సేవలు 24 గంటల పాటు నిలిచిపోనున్నాయి. మెజారిటీ డాక్టర్లు ఆగస్ట్ 17న స్రైక్లో ఉంటారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోనూ ఓపీడీలు నడిచే పరిస్థితి ఉండదు. సాధారణ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.

జూనియర్‌ డాక్టర్‌పై మెడికల్ ఆస్పత్రిలోనే జరిగిన ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రాజకీయ నాయకులు, సిని రంగ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. మరో నిర్భయ ఘటన అంటూ పలువురు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతిపై అత్యంత పాశావికంగా దాడి చేసి, హత్య చేసినట్లు వెల్లడైన పోస్ట్ మార్టం రిపోర్ట్ అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

దేశవ్యాప్తంగా వైద్యులు ఈ దారుణ ఘటనపై నిరసనగళం వినిపించారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం అయినప్పటికీ ఆరోజు కూడా వైద్యులు నిరసనలను కొనసాగించారు. హత్యను నిరసిస్తూ ఆగస్ట్ 13న దేశవ్యాప్తంగా ఓపీడీ సేవలను బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..