అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సక్సెస్ రేట్ ఎంతో తెల్సా.. లెక్కలు చూస్తే ముక్కున వేలేసుకుంటారు
ప్రపంచం మొత్తం చూపు ఇస్రో వైపు.. కలిసి పని చేసేందుకు నాసా లాంటి సంస్థల సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి.. అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్‌గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి.
ప్రపంచం మొత్తం చూపు ఇస్రో వైపు.. కలిసి పని చేసేందుకు నాసా లాంటి సంస్థల సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి.. అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్‌గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన, కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటుతోంది.
ఇస్రో ఇప్పటివరకు 97 రాకెట్ ప్రయోగాలు చేసి…అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయిని కైవసం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ… ఇప్పుడు సెంచరీకి జస్ట్ మూడు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఈ ఏడాది మరో 3 ప్రయోగాలు చేస్తే ఇస్రో సెంచరీ కొడుతుంది. ఈ ఏడాది క్వార్టర్-3లో స్పేడెక్స్, డిసెంబర్‌లో శుక్రయాన్, అలాగే మంగళ్‌యాన్ -2 ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఈ 3 ప్రయోగాలు పూర్తయితే ఇస్రో సెంచరీ కొట్టడం ఖాయం.
ఇక స్పేడెక్స్ అంటే…స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్. అంటే అంతరిక్షంలో స్పేస్ షిప్‌ని నిలిపి ఉంచే స్టేషన్ నిర్మాణంలో ఇదో భాగం. దీనిలో 2 అంతరిక్ష నౌకలను అనుసంధానిస్తారు. కంట్రోల్ సిస్టమ్‌తో అంతరిక్ష నౌకలను నియంత్రిస్తారు. 2028 -2035 కల్లా అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కల సాకారం కావాలంటే…స్పేడెక్స్ టెక్నాలజీపై ఇస్రో పట్టు సాధించాలి. ఎందుకంటే దీనిపైనే ఆస్ట్రోనాట్ల రాకపోకలు ఆధారపడి ఉంటాయి.
శుక్రయాన్ మిషన్‌లో భాగంగా వీనస్ ఆర్బిటర్‌ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. దీనిలో 100 కిలోల పేలోడ్ ఉంటుంది. మనం సొంతంగా తయారు చేసుకున్న 12 పరికరాలతో పాటు, ఒక అంతర్జాతీయ పరికరాన్ని కూడా దీనిలో అమరుస్తారు. శుక్రుడి వాతావరణం, సోలార్ విండ్‌పై ఇది పరిశోధనలు జరుపుతుంది. మంగళ్‌యాన్ – 2 మిషన్‌లో అంగారకుడి పైకి ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగిస్తారు. అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఇది సమాచారం సేకరిస్తుంది. దీనిలో ల్యాండర్, రోవర్ కూడా ఏర్పాటు చేయాలని మొదట్లో నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఆర్బిటర్ మిషన్ మాత్రమే అంటోంది ఇస్రో. ఈ 3 ప్రయోగాలు, ఈ ఏడాదిలోనే పూర్తయితే ఇస్రో ప్రయోగాల సెంచరీ కొట్టడం ఖాయం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి