Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో 20 శాతం భూగర్భజలాల్లోనే విషపూరితమైన ఆర్సెనిక్‌.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

భారత్‌లోని 20 శాతం భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్‌ ఉన్నట్లు ఐఐటీ ఖగ్‌పూర్‌ వెల్లడించింది. 25 కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు ఐఐటీ అధ్యయనంలో తేలింది..

భారత్‌లో 20 శాతం భూగర్భజలాల్లోనే విషపూరితమైన ఆర్సెనిక్‌.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
Follow us
Subhash Goud

|

Updated on: Feb 12, 2021 | 7:33 AM

భారత్‌లోని 20 శాతం భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్‌ ఉన్నట్లు ఐఐటీ ఖగ్‌పూర్‌ వెల్లడించింది. 25 కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు ఐఐటీ అధ్యయనంలో తేలింది. కృతిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఐఐటీ పేర్కొంది. అయితే ఇటీవల సైన్స్‌ అఫ్‌ ద టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ జర్నల్‌లో ఈ పరిశోధన పత్రాలు ప్రచురితం అయ్యాయి. అయితే పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా పరిశీలిస్తే.. దేశమంతటా ప్రమాదకరమైన ఆర్సెనిక్‌ స్థాయిలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

ఆర్సెనిక్ అధికంగా గమనించిన ప్రాంతాలు సింధు-గంగా-బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు. పంజాబ్‌లో 92 శాతం, బీహార్‌ 70 శాతం. బెంగాల్‌ 69 శాతం. అసోం 48 శాతం, హర్యానా 43 శాతం, ఉత్తరప్రదేశ్‌ 28 శాతం,గుజరరాత్‌ 24 శాతం రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఆర్సెనిక్‌ను గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు. భారత్‌లోని 250 మిలియన్లకుపైగా ప్రజలు ఆర్సెనిక్‌ను ఎక్కువశాతం తీసుకుంటున్నట్లు ఖరక్‌పూర్‌ ఐఐటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అభిజిత్‌ ముఖర్జీ తెలిపారు. దేశంలో లీటరుకు 10 మైక్రోగ్రాములు ఆర్సెనిక్‌ ఉండాలని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువ ఆర్సెనిక్‌ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూగర్భ జలాల నుంచే లభిస్తుందని ఆయన అన్నారు. గతంలో చేసిన పరిశోధనలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయని వారు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తమ అధ్యయనం ద్వారా ప్రజలు సురక్షతమైన తాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తున్నామని అన్నారు. అయితే ఆర్సెనిక్‌ ద్వారా క్యాన్సర్‌, ఇతర వ్యాధులు, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Also Read:

India Deaths: భారత్‌లో ప్రతియేటా 27 లక్షల మరణాలు.. అసలు కారణం ఇదే.. నివేదికలో తేల్చిన ప్రముఖ సంస్థలు

ఉత్తరాఖండ్‌ జలప్రళయం: సహాయక చర్యలకు అవాంతరాలు, రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో కొన్ని గంటలపాటు బ్రేక్‌

పదో తరగతి విద్యార్ధులకు 2025 బిగ్‌షాక్.. ఫలితాలు మరింత ఆలస్యం..?
పదో తరగతి విద్యార్ధులకు 2025 బిగ్‌షాక్.. ఫలితాలు మరింత ఆలస్యం..?
తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్..
తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్..
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి