9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండకూడదు..! టెలికాం శాఖ కొత్త రూల్‌..? తెలుసుకోండి..

|

Dec 10, 2021 | 8:36 PM

Telecom Department: దేశవ్యాప్తంగా తొమ్మిది కంటే ఎక్కువ కనెక్షన్లు కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్‌ల సిమ్‌లను తిరిగి ధృవీకరించాలని టెలికాం విభాగం

9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండకూడదు..! టెలికాం శాఖ కొత్త రూల్‌..? తెలుసుకోండి..
Sim
Follow us on

Telecom Department: దేశవ్యాప్తంగా తొమ్మిది కంటే ఎక్కువ కనెక్షన్లు కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్‌ల సిమ్‌లను తిరిగి ధృవీకరించాలని టెలికాం విభాగం (DoT) ఆర్డర్ జారీ చేసింది. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రం అస్సాం విషయంలో ఈ పరిమితి ఆరు కనెక్షన్లకు కుదించింది. వెరిఫికేషన్ లేని పక్షంలో కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సబ్‌స్క్రైబర్‌లు తాము ఏ కనెక్షన్‌ని ఉంచాలనుకుంటున్నారో ఎంచుకునే ఎంపికను కల్పిస్తుంది. మిగిలిన వాటిని డియాక్టివేట్ చేస్తారు. అక్టోబర్ 7న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సమాచారం.

ఆర్డర్‌లో ఏం చెప్పారు?
టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ఒక వ్యక్తి తొమ్మిది కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్‌లను కలిగి ఉంటే అవన్ని మళ్లీ ధృవీకరించాలి. లేదంటే డియాక్టివేట్ చేస్తారు. ఆర్థిక నేరాలు, మోసపూరిత కాల్‌లు, ఆటోమేటెడ్ కాల్‌లు, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి టెలికాం శాఖ ఈ చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం.. ఉపయోగంలో లేని అన్ని మొబైల్ కనెక్షన్‌లను డేటాబేస్ నుంచి తొలగించాలని టెలికాం ఆపరేటర్‌లను టెలికాం శాఖ కోరింది.

సబ్‌స్క్రైబర్ రీ-వెరిఫికేషన్ కోసం రాకపోతే ఆ నంబర్ 60 రోజుల్లో డీయాక్టివేట్ చేస్తారు. డిసెంబర్ 7 నుంచి ఈ పద్దతి ప్రారంభమవుతుంది. సబ్‌స్క్రైబర్ అంతర్జాతీయ రోమింగ్‌లో ఉన్నట్లయితే లేదా శారీరక వైకల్యం ఉన్నట్లయితే లేదా ఆసుపత్రిలో ఉంటే అటువంటి సందర్భాలలో అదనంగా 30 రోజులు కేటాయిస్తారని టెలికాం శాఖ ఆర్డర్ పేర్కొంది. ఒకవేళ నంబర్ నకిలీ కాలర్‌గా గుర్తిస్తే అవుట్‌గోయింగ్ సేవలు 5 రోజుల్లో నిలిపివేస్తారు. అటువంటి సందర్భాలలో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 10 రోజుల్లో నిలిపివేయాలని ఆర్డర్‌లో ఉంది. ఎవరైనా ధృవీకరణ కోసం రాకపోతే 15 రోజుల్లో పూర్తిగా కనెక్షన్‌ డియాక్టివేట్ అవుతుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్న పరిమితులను క్రమం తప్పకుండా సబ్‌స్కైబర్లు తెలుసుకోవాలి.

దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం చెమటోడ్చుతున్న రోహిత్‌.. ప్రాక్టీస్‌ వీడియో చూస్తే అదిరిపోవాల్సిందే..

టీమిండియాలో చోటు ఇప్పుడంత ఈజీ కాదు.. ఎందుకంటే ద్రావిడ్‌ రూల్స్‌ మారుస్తున్నాడుగా..?

ఆ మ్యాచ్‌లో సీనియర్‌ ఆటగాడితో విరాట్ కోహ్లీ గొడవ.. ఇద్దరి మధ్య దూషణలు తారాస్థాయికి చేరాయి..