సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకుంటున్న కర్నాటక టాప్ లేడీ బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు పడింది. ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపా ముద్గిల్ తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు కూడా చేయరాదని ఇద్దరు మహిళా అధికారులను కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. కన్నడనాట ఇద్దరు మహిళా సివిల్ సర్వీస్ అధికారులు మధ్య యుద్ధం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా ముద్గిల్ ఫేస్‌బుక్‌లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్‌లు చేశారు. రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. రోహిణిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ఉన్నతాధికారులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఇష్యూ హాట్‌టాపిక్‌గా మారింది. కర్నాటకలో రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు. ఇద్దరి మద్య రచ్చ కారణంగా ప్రభుత్వం పదవుల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసింది. కొత్తగా ఎలాంటి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు.
తెలుగు IAS అధికారి రోహిణి సింధూరి వ్యవహారం కర్ణాటకలో చాలారోజులుగా వివాదం నడుస్తోంది. మొదట్లో చాలా సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరి తీరు రానూ రానూ వివాదాస్పదమైంది. తాజాగా అదే రాష్ట్రంలో మరో కీలక పోస్టులో ఉన్న ఐపీఎస్ రూపాముద్గల్ కీలక ఆరోపణలు చేశారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐఏఎస్ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. కోవిడ్ టైంలో మైసూర్ కలెక్టర్‌గా ఉన్న రోహిణి..విలాసవంతమైన స్విమ్మింగ్ ఫూల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఏకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితా రిలీజ్ చేశారు.
Karnataka | IPS officer D Roopa Moudgil and IAS officer Rohini Sindhuri transferred without posting after fight on social media over sharing private photos. pic.twitter.com/YdP5QL4OUg
— ANI (@ANI) February 21, 2023
ఐపీఎస్ రూపా ముద్గల్ తన ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై ఐఏస్ రోహిణి సింధూరి మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రూపా ముద్గల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. రూపా ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని సెటైర్ వేశారు రోహిణి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..