AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రఫేల్ డీల్ ని రాజకీయం చేయరాదు, ఐఏఎఫ్ మాజీ చీఫ్

ఫ్రాన్స్ నుంచి ఇండియాకు  రఫేల్ యుధ విమానాలు అందడాన్ని భారత వైమానికదళం మాజీ చీఫ్ బీఎస్.ధనౌవా స్వాగతించారు. రాజకీయ వివాదాలకు తావు లేకుండా వీటిని పొందడం ముదావహమన్నారు. లోగడ..

రఫేల్ డీల్ ని రాజకీయం చేయరాదు, ఐఏఎఫ్ మాజీ చీఫ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 30, 2020 | 12:37 PM

Share

ఫ్రాన్స్ నుంచి ఇండియాకు  రఫేల్ యుధ విమానాలు అందడాన్ని భారత వైమానికదళం మాజీ చీఫ్ బీఎస్.ధనౌవా స్వాగతించారు. రాజకీయ వివాదాలకు తావు లేకుండా వీటిని పొందడం ముదావహమన్నారు. లోగడ..1980 ప్రాంతాల్లో బోఫోర్స్ ఒప్పందం పెద్దఎత్తున రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రక్షణ సాధనాలను కొనుగోలు చేసే విషయంలో.. భారత సైన్యం సందేహిస్తూ వచ్చింది. అయితే రఫేల్ ఫైటర్ల విషయంలో అలా జరగకపోవడం హర్షణీయమని, ఈ డీల్ కి రాజకీయ మకిలి అంటకపోవడం మంచి పరిణామమని ధనౌవా పేర్కొన్నారు. వీటి కొనుగోలును సమర్థిస్తున్నా అన్నారు. ఈ విమానాలు మన వైమానిక దళ సామర్థ్యానికి ప్రతీక అవుతాయన్నారు.

ఫ్రాన్స్ నుంచి ఇండియాకు నిన్న తొలివిడతలో భాగంగా ఐదు రఫేల్ విమానాలు అందాయి.  ఇవి అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి.