ప్రతివారి రక్షణకై ప్రార్థిస్తా.. విశాఖ ఘటనపై మోదీ

విశాఖపట్నంలో ఓ కెమికల్ ప్లాంట్ నుంచి విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రమ వ్యక్తం చేశారు. దీనిపై తాము హోం మంత్రిత్వ శాఖతోను, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతోను మాట్లాడామని ఆయన తెలిపారు..

ప్రతివారి రక్షణకై ప్రార్థిస్తా.. విశాఖ ఘటనపై మోదీ

Edited By:

Updated on: May 07, 2020 | 10:55 AM

విశాఖపట్నంలో ఓ కెమికల్ ప్లాంట్ నుంచి విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రమ వ్యక్తం చేశారు. దీనిపై తాము హోం మంత్రిత్వ శాఖతోను, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతోను మాట్లాడామని ఆయన తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి ప్రతివారి రక్షణకూ తాను ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్లు చేసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశాన్ని యుధ్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.  విశాఖ ఘటనలో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందగా సుమారు రెండు వందలమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.