AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భార్య కాపురానికి రావడం లేదని తనకు తానే పనిష్మెంట్.. ఆ పార్ట్ కట్

భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్. చెప్పాలంటే గొడవలు లేని కాపురమే ఉండదు. కానీ.. ఆ గొడవలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవాలి. అంతే కానీ వాటిని పెద్దగా చేసుకోకూడదు. లేకుంటే తీవ్ర పరిణామాలు..

Viral: భార్య కాపురానికి రావడం లేదని తనకు తానే పనిష్మెంట్.. ఆ పార్ట్ కట్
Knife Attack
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 21, 2023 | 8:19 PM

భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్. చెప్పాలంటే గొడవలు లేని కాపురమే ఉండదు. కానీ.. ఆ గొడవలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవాలి. అంతే కానీ వాటిని పెద్దగా చేసుకోకూడదు. లేకుంటే తీవ్ర పరిణామాలు జరుగుతాయి. కాబట్టి దాంపత్య జీవితంలో వచ్చే కలహాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలి. భార్యా భర్తలు అన్నాక ఎవరో ఒకరు కాస్త తగ్గాలి. అప్పుడే దాంపత్యం బాగుంటుంది. శృతి మించితే మాత్రం ఇలాంటిదే జరుగుతుందనే దానికి ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రావడం లేదని ఓ భర్త.. దారుణానికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో ఏకంగా తన ప్రైవేటు పార్టునే నరుక్కున్నాడు. ఈ ఘటన బిహార్ లో జరిగింది.

బిహార్ లోని మాధేపురా నియోజకవర్గ పరిధిలోని రజ్నీనాయ నగర్‌కు చెందిన కృష్ణ కు అనిత అనే యువతితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు సంతానం. కుటుంబ పోషణ కోసం కృష్ణ.. పంజాబ్‌లోని మండిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన తల్లిదండ్రులను చూసేందుకు సొంతూరుకు వెళ్లాడు. అప్పటికే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. తిరిగి వచ్చేందుకు నిరాకరించింది. రావాలని కోరినా.. రేపు మాపు అంటూ కాలయాపన చేసింది.

దీంతో కృష్ణ తీవ్ర కోపంతో పదునైన ఆయుధంతో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని గుర్తించిన కుటుంబీకులు.. చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..